వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలా ఉద్దేశంతో వెళ్లలేదు.., అర్దరాత్రి ఇలా చిక్కి!: టెక్కీ ఇందుజ హంతకుడి వాంగ్మూలం

హఠాత్తుగా తనను దూరం పెట్టడం బాధించిందని, వాళ్ల మనసు మారకపోవడంతోనే ఉన్మాదిగా మారానని వివరించాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెను తగలబెట్టిన ప్రేమోన్మాది ఆకాష్ పోలీసుల విచారణలో పలు వివరాలు వెల్లడించాడు.

Recommended Video

ఒక ప్రేమోన్మాది ఎంతకి తెగించాడంటే? A Girl Lost Life By Psycho Lover

తెగబడ్డ ప్రేమోన్మాది: పెళ్లి చేయమని ఎంతకి తెగించాడంటే?.. చెన్నైలో విషాదంతెగబడ్డ ప్రేమోన్మాది: పెళ్లి చేయమని ఎంతకి తెగించాడంటే?.. చెన్నైలో విషాదం

స్కూల్లో చదువుతున్నప్పుడే ఇందుజతో తనకు పరిచయం, ప్రేమ ఏర్పడ్డాయని చెప్పాడు. ఇందుజ ఇంట్లో తానూ ఓ కుటుంబ సభ్యుడిలా మారిపోయానని, ఇంటికి ఎన్నో సపర్యలు చేశానని తెలిపాడు. హఠాత్తుగా తనను దూరం పెట్టడం బాధించిందని, వాళ్ల మనసు మారకపోవడంతోనే ఉన్మాదిగా మారానని వివరించాడు.

 హఠాత్తుగా దూరం పెట్టడంతో:

హఠాత్తుగా దూరం పెట్టడంతో:

హఠాత్తుగా ఇందుజ తనను దూరం పెట్టడంతో మూడు నెలలు తీవ్ర మనోవేదన చెందినట్టు ఆకాష్ తెలిపాడు. ఈ మూడు నెలల్లో చాలాసార్లు ఆమెను కలిసేందుకు ప్రయత్నించానని, ఎంతో ప్రాధేయపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇందుజ తల్లి ఆమె మనసును పూర్తిగా మార్చివేసిందన్నాడు. చివరకు ఇందుజ కూడా తనను అసహ్యించుకోవడంతో తట్టుకోలేకపోయానని, అందువల్లే ఉన్మాదిగా మారానని తెలిపాడు.

 ఆ ఉద్దేశంతో వెళ్లలేదు:

ఆ ఉద్దేశంతో వెళ్లలేదు:

సోమవారం రాత్రి తీవ్ర ఆగ్రహంతో పెట్రోల్ క్యాన్ తీసుకుని ఇందుజ ఇంటికెళ్లానని, అయితే ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశం తనకు లేదని తెలిపాడు. ఇందుజ తల్లి తనను లోపలికి అనుమతించలేదని, ఎంతో ప్రాధేయపడితే గానీ ఇందుజతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. అయితే ఇందుజ తనను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపాడు.

ఇలా పట్టుబడ్డాడు:

ఇలా పట్టుబడ్డాడు:

ఇందుజపై పెట్రోల్ పోసే క్రమంలో ఆమె తల్లి, చెల్లి పరిగెత్తుకురావడంతో.. వారిపై కూడా పెట్రోల్ పోశానని, ఇంతలో స్థానికులు రావడంతో.. నిప్పంటించి బైక్ పై ఉడాయించానని చెప్పుకొచ్చాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, ఇదే విషయమై ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు మెసేజ్ పెట్టానని అన్నాడు. చివరకు గస్తీ పోలీసులకు చిక్కాడు. అర్థరాత్రి వేళ గస్తీ పోలీసులు అనుమానంతో తనను అదుపులోకి తీసుకున్నారని, తర్వాత తానే అసలు నిజం ఒప్పుకున్నానని అన్నాడు.

ఆత్మహత్య చేసుకుంటే బాగుండేది

ఆత్మహత్య చేసుకుంటే బాగుండేది

తాను ఆత్మహత్య చేసుకుంటే బాగుండేదని ఆకాష్ పేర్కొనడం గమనార్హం. బుధవారంర ఉదయం కోర్టులో హాజరుపర్చిన తర్వాత అతన్ని పుళల్ జైలుకు తరలించారు. ఇందుజ హత్య నేపథ్యంలో ఆదంబాక్కం ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో చివరకు శాంతించారు. ఆకాష్ దాడిలో ఇందుజ చనిపోగా, ఆమె తల్లి రేణుక, చెల్లి నివేదలు తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

English summary
Akash, who was Accused in Induja's murder case has revealed more details infront of police after arrest
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X