• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అధికారులను బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే బెయిల్‌పై విడుదల...అనంతరం సంబరాలు...గాల్లోకి కాల్పులు

|

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో అక్రమ కట్టడాలను కూలగొడుతున్న మున్సిపల్ అధికారులను బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే విజయ్ వర్గీయాకు బోపాల్ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది..అయితే నాలుగు రోజుల జైలు శిక్ష తర్వాత జైలు నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే విజయ వర్గీయాకు కార్యకర్తలు, ఘన స్వాగతం పలికారు..అనంతరం స్వీట్లు పంచిపెట్టారు... కార్యకర్తలు స్థానికంగా ఉన్న పోలీసులకు సైతం స్వీట్లు పంచిపెట్టి , ఎమ్మెల్యే కార్యాలయం ముందు గాల్లోకి కాల్పులు జరిపారు.

బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

బ్యాట్‌తో కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

గత నాలుగు రోజుల క్రితం ఇండోర్‌ నుండి మొదటి సారి ఎంపీకైన బీజేపీ ఎమ్మెల్యే, స్థానిక బీజేపీ సీనియర్ నాయకుడు కైలాశ్ విజయ్ వర్గీయ కుమారుడు స్థానికంగా అక్రమంగా కట్టడాలను కూల్చుతున్న మున్సిపల్ అధికారులను అడ్డుకుని వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే ఆయన అధికారులపై క్రికెట్ బ్యాట్‌తో కొట్టడడం సంచలనం రేపింది..దీంతో దాడి చేసిన ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు..కాగా ఓ వైపు ప్రజలు, మీడియా చూస్తున్నారనే ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి అధికారులను బ్యాట్ కొట్టడడం ద్వార అనేక విమర్శలను , వ్యతిరేకతలను ఎదుర్కోన్నాడు.

విడుదల సంధర్భంగా స్వీట్లు ,గాల్లోకి కాల్పులు,

విడుదల సంధర్భంగా స్వీట్లు ,గాల్లోకి కాల్పులు,

ఇక విజయ వర్గీయను పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కూడ ప్రజలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు..దీంతో ఉద్రిక్త వాతవారణం నడుమ ఎమ్మెల్యేలను జైలుకు కోర్టుకు తరలించారు.అనంతరం ఆయన్ను రిమాండ్‌కు పంపిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది..ఇక నాలుగు రోజుల పాటు జైలు శిక్షను అనుభవించిన అనంతరం భోపాల్ ప్రత్యేక కోర్టు ఎమ్మెల్యేకు శనివారం బెయిల్ మంజూరు చేసింది..అయితే బెయిల్ మంజూరు కావడంతో విజయవర్గీయ అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు..జైలు నుండి విడుదల అయిన ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికారు..జైలు నుండి పార్టీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు...ఈ సంధర్భంలోనే పెద్ద ఎత్తున స్వీట్లుకూడ పంచారు...ఇక ఈ స్వీట్లను స్థానికంగా విధుల్లో ఉన్న పోలీసులకు సైతం పంచారు.

తాను ఏమాత్రం సిగ్గు పడడం లేదు..ఎమ్మెల్యే

ఇక జైలు నుండి నేరుగా విజయ వర్గీయ పార్టీ కార్యాలయానికి వెళ్లారు...ఈనేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ అధికారిని బ్యాట్‌తో కొట్టడం ద్వార తాను ఏమాత్రం సిగ్గుపడడం లేదని చెప్పారు..ఎందుకంటే తాను ప్రజల కోసం అలా చేశాను తప్ప, వ్యక్తిగత కారణాలతో కాదని అన్నారు..ఈనేపథ్యంలోనే మరోసారి బ్యాట్ పట్టుకుని అధికారులను కొట్టే స్థితికి తీసుకురావద్దని భగవంతున్ని ప్రార్థించానని చెప్పారు.నియోజకవర్గ అభివృద్ది కోసం కట్టుబడి ఉంటానని అన్నారు.కాగా మీడియాతో మాట్లాడుతూ తాను ఏమాత్రం తప్పు చేశాననే ఆలోచనలో లేనని ,భాద్యయుతాంగానే తాను వ్యవహరించినట్టు ఎమ్మెల్యే చెప్పారు..ఇక ఆయన విడుదల సంధర్భంగా కార్యకర్తలు గాల్లోకి కాల్పులు జరిపారు.

ముందు రెక్వెస్ట్,వినకపోతే దాడులు, ఎమ్మెల్యే నినాదం..

ముందు రెక్వెస్ట్,వినకపోతే దాడులు, ఎమ్మెల్యే నినాదం..

ఇక జరిగిన సంఘనటపై పార్టీ హైకమండ్ సైతం స్పందించింది, పార్టీ అధ్యక్షుడు అమిత్ జరిగిన సంఘటన పూర్తి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు..మరోవైపు ఎమ్మెల్యే సైతం ముందు రెక్వేస్ట్ ఆ తర్వాత దాడాలు అనే నినాదం ఇవ్వడం రాష్ట్ర్ర వ్యాప్తంగా ఈకేసు సంచలనం రేగింది..పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి..అయినా బ్యాట్‌తో దాడి చేసిన ఎమ్మెల్యే మాత్రం ఎలాంటీ తప్పు చేయలేదనే ఫిలింగ్‌లో ఉండడం కొసమెరుపు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Akash Vijayvargiya who was arrested for thrashing official with cricket bat was given bail by a special court in Bhopal.in this movement Party workers had also fired shots in the air at the BJP office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more