• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహంత్ గిరి మహారాజ్ ఇకలేరు: 8 పేజీల లేఖ, ఆనంద్ గిరి పేరు, భూ మాఫియా..?

|

అఖిల భారతీయ అఖండ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ పరమపదించారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో గల తన నివాసంలో విగతజీవిగా మారారు. మహారాజ్ మృతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆశ్రమం తదనంతరం ఎవరూ చూసుకునే అంశాన్ని ప్రస్తావించారు. శిష్యుడు ఆనంద్ గిరీ పేరు ఉందని పోలీసులు తెలిపారు. కానీ ఆయన తన పేరుతో కొందరు కుట్ర చేస్తున్నారని ఆనంద్ ఆరోపించారు. భూ మాఫియా పేరును ప్రస్తావించారు. దీంతో మహారాజ్ ఎలా చనిపోయారనే సందేహాలు వస్తున్నాయి.

ఉరేసుకొని ఆత్మహత్య..?

ఉరేసుకొని ఆత్మహత్య..?

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాజ్ హఠాన్మరణం కాషాయ దళానికి ఇబ్బంది కలిగించేది. విచారణలో నిజ నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. మహారాజ్ తన గదిలో ఉరి వేసుకొని చనిపోయారు. నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నారని.. డోర్ తగులగొట్టేసరికి అచేతనంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే మహారాజ్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. మహారాజ్ రాసిన సూసైడ్ నోట్‌లో ఆశ్రమానికి సంబంధించి వ్యవహారాలను ఎవరు చూసుకోవాలనే అంశానికి సంబంధించి వీలునామా కూడా రాశారు. అందులో ఆనంద్ గిరి పేరు ఉంది. ఇతర శిష్యుల పేర్లను కూడా మహారాజ్ ప్రస్తావించారు.

ఆస్తి కోసమా..? కుట్ర..?

ఆస్తి కోసమా..? కుట్ర..?

ఆనంద్ గిరి పేరు తెరపైకి రావడంతో ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. ఆశ్రమ ఆస్తి కోసమే ఆనంద్ ఏమైనా చేశారా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు. మహారాజ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉంది అని ఆరోపించారు. అందుకే తెరపైకి తన పేరు తీసుకొచ్చారని ఆరోపించారు. దీనికి సంబంధించి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టంచేశారు. తప్పు చేశానని రుజువు అయితే.. ఎలాంటి శిక్ష అనుభవించడానికి అయినా సిద్దం అని చెప్పారు. 15 రోజుల క్రితమే గురుజీతో తాను మాట్లాడానని వివరించారు. గురుజీ హత్యతో ల్యాండ్ మాఫియాకు లింక్ ఉందని ఆరోపించారు. నగదు కోసం కొందరు వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

ఐజీపై ఆరోపణలు..?

ఐజీపై ఆరోపణలు..?


అలాగే ఐజీ కేపీ సింగ్‌పై కూడా ఆనంద్ గిరి ఆరోపణలు చేశారు. అతనిపై విచారణ జరపాలని కోరడం చర్చానీయాంశం అయ్యింది. మరోవైపు మహారాజ్ ఈ ఏప్రిల్‌లో కరోనా వైరస్ కూడా సోకింది. అప్పటినుంచి ఆయన ఒంటరిగా ఉన్నారని ఆనంద్ గిరి వివరించారు. ఆ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నారని ఇండెరెక్టుగా తెలిపారు.

మోడీ సంతాపం

మహారాజ్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. సంత్ సమాజం అనుసంధానించడం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

తీరనిలోటు: యోగి

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సంతాపం తెలియజేశారు. గురుజీ మృతి ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరనిలోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గురుజీ లేరనే విషయాన్ని తట్టుకునే ధైర్యం అతని శిష్యులకు ఇవ్వాలని యోగి శ్రీరాముడిని ప్రార్థించారు.

ధైర్యం ప్రసాదించాలి: అఖిలేశ్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా గురుజీ మృతిపై సంతాపం తెలియజేశారు. అతని ఆశ్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అతని అనుచరులకు ఆ భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరారు. ఇదివరకు హరిద్వార్‌లో గురుజీని అఖిలేశ్ యాదవ్ కలిశారు.

మరవలేం: కేశవ్ ప్రసాద్ మౌర్య


యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా సంతాపం తెలియజేశారు. గురుజీని దేశ ఆద్యాత్మిక ప్రపంచం మరచిపోదన్నారు. అతని శిష్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని తెలియజేశారు.

English summary
Mahant Narendra Giri Maharaj, president of the Akhil Bharatiya Akhada Parishad was found dead at his residence in Uttar Pradesh's Prayagraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X