వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ చేసిన 'బిగ్ మిస్టెక్' అదే!.. అలా చేయకపోయి ఉంటే: బీజేపీ

కాంగ్రెస్ తో జతకట్టి అఖిలేష్ పెద్ద తప్పు చేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ జతకట్టకపోయినా ఎస్పీ ఓడిపోయేది గానీ మరీ ఇంత భారీ తేడాతో కాదని పేర్కొన్నారు.

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: యూపీలో ఎస్పీ చేజేతులా అధికారాన్ని దూరం చేసుకున్నట్లైంది. కుటుంబ కలహాలకు తోడు కాంగ్రెస్ తో జతకట్టినందుకు ఆ పార్టీ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. బీజేపీ పాగా వేయడంతో భవిష్యత్తులో అఖిలేష్ నాయకత్వం తిరిగి పుంజుకునే అవకాశాలపై ఇప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి.

బీజేపీ హవా ముందు ఎస్పీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో తప్పులను వెతుక్కునే పనిలో ఎస్పీ నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత రాహుల్ సిన్హా స్పందించారు. కాంగ్రెస్ తో జతకట్టడమే అఖిలేష్ చేసిన పెద్ద తప్పు అన్నారు. కాంగ్రెస్‌తో జతకట్టకపోయినా ఎస్పీ ఓడిపోయేది గానీ మరీ ఇంత భారీ తేడాతో కాదని పేర్కొన్నారు.

ఇక బీజేపీ విజయం గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలు నూతన భారత్ కు మద్దతుగా నిలిచారని, ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో తాము ఘనవిజయం సాధించామని అఖిలేష్ అన్నారు. గోవా, మణిపూర్ లలో కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, యూపీలో బీజేపీకి 403 స్థానాలకు గాను 312 సీట్లు గెలుచుకోగా.. పొత్తులతో మరో 13సీట్లు ఆ పార్టీ దక్కించుకోబోతుంది.

 Akhilesh's biggest mistake was to join hands with Congress: BJP

ఇక గోవా ఎన్నికల్లో కాంగ్రెస్-17సీట్లతో తొలిస్థానంలో, 13సీట్లతో బీజేపీ రెండోస్థానంలో నిలిచాయి. కానీ స్థానిక పార్టీల నుంచి నేతలు బీజేపీకే మద్దతు పలకడంతో పారికర్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమయ్యారు.

మణిపూర్ లోను ఇదే పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 21సీట్లు, కాంగ్రెస్ 27సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ కే ఎక్కువ స్థానాలు వచ్చినప్పటికీ.. బీజేపీ తమకు 31మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు ప్రకటించింది. దీంతొ మణిపూర్ లోను బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాముంది.

English summary
The Bharatiya Janata Party (BJP), after sweeping Uttar Pradesh in the recent assembly polls, said on Monday that outgoing Chief Minister Akhilesh Yadav led-Samajwadi Party's biggest mistake was to collaborate with the Congress Party which led to its downfall.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X