కోవిడ్ ను వ్యాప్తి చేస్తున్న బీజేపీ - ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి : అఖిలేష్ డిమాండ్..!!
మినీ
సార్వత్రిక
ఎన్నికల
సమరంగా
మారిన
యూపీ
ఎన్నికల్లో
రాజకీయ
విమర్శలు
పదునెక్కుతున్నాయి.
యూపీలో
ఇప్పుడు
బీజేపీ
వర్సెస్
ఎస్పీ
నేతల
మధ్య
వ్యాఖ్యలు
రాజకీయంగా
వేడి
పుట్టిస్తున్నాయి.
తాజాగా..
సమాజ్
వాదీ
అధినేత
అఖిలేష్
బీజేపీ
పైన
తీవ్ర
వ్యాఖ్యలు
చేసారు.
బీజేపీ
కార్యకర్తలు
ఎన్నికల
ప్రచారంలో
కర
పత్రాలు
పంచటం
ద్వారా
కరోనాను
వ్యాప్తి
చేస్తున్నారని
విమర్శించారు.
ఆర్ఎల్డీ
అధినేత
జయంత్
చౌదరితో
కలిసి
ఏర్పాటు
చేసిన
మీడియా
సమావేశంలో
ఆయన
ఈ
వ్యాఖ్యలు
చేసారు.

బీజేపీ నేతలను నియంత్రించండి
బీజేపీ నేతలు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని..ఇటువంటి వారి పైన ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని.. వారిని నియంత్రించాలని డిమాండ్ చేసారు. ఉత్తర ప్రదేశ్ లో ప్రతికూల రాజకీయాలకు ముగింపు పలకటమే తమ ఉద్దేశమని స్పష్టం చేసారు. కైరానా నుంచి హిందువుల వలసలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలపై అఖిలేష్ యాదవ్‌ను ప్రశ్నించగా, ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ రాజకీయంగా వలసలు వెళ్లనుందంటూ సమాధానం ఇచ్చారు.

బీజేపీ ప్రతిపాదనపై ఎద్దేవా
బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాల్సిందిగా జయంత్ చౌదరిని అమిత్ షా ఆహ్వానించడంపై అడిగిన ప్రశ్నకు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ‘వారి ఆఫర్‌ను ఎవరు అంగీకరిస్తున్నారో.. పరిస్థితుల గురించి ఆలోచించండి.. వాళ్లకు బహిరంగ ఆహ్వానాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందంటూ ఎద్దేవా చేసారు. జయంత్ చౌదరి మాట్లాడుతూ, రైతులు మరియు కార్మికులను సంఘటితం చేయాలనే చౌదరి చరణ్ సింగ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికే ఆర్ఎల్డీ.. ఎస్పీ మద్య పొత్తు కుదిరిందని చెప్పారు.

ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారంటూ
అధికార పార్టీకి ఓటు వేయడానికి పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించమని అధికారులు ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటరు గుర్తింపు కార్డులను సీనియర్ అధికారులతో పంచుకోవద్దని, సీనియర్ అధికారుల ఒత్తిడితో పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించవద్దని ఆయన కోరారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉత్తర ప్రదేశ్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఫిబ్రవరి 14న తొలి విడత పోలింగ్ జరగనుండటంతో... బీజేపీ ఇక్కడ అధికారం నిలబెట్టుకోవటం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.