వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ను కాదని ఎస్పీ-బీఎస్పీ కూటమిలో మరో పార్టీకి చోటు: మూడు సీట్లతో సరిపెట్టిన అఖిలేష్

|
Google Oneindia TeluguNews

లక్నో: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ ను కాదని మరో పార్టీకి చోటు ఇచ్చింది ఎస్పీ-బీఎస్పీ కూటమి. తాజాగా రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ) ఈ కూటమిలో చేరింది. రాష్ట్రీయ లోక్ దళ్ కు మూడు లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించింది. ఆర్ఎల్డీ పోటీ చేసే స్థానాలు ఏవో ఇంకా ఖరారు కాలేదు. అయినప్పటికీ- మధుర, బాగ్ పట్, ముజప్ఫర్ నగర్ స్థానాలను కేటాయించవచ్చని తెలుస్తోంది.

ఆర్ఎల్డీతో పొత్తు ఖరారు..

ఆర్ఎల్డీతో పొత్తు ఖరారైనట్టు ఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీని అడ్డుకోవడానికే తాము ఆర్ఎల్డీని కూటమిలోకి చేర్చుకున్నట్లు తెలిపారు.

Akhilesh Yadav to Announce UP Seat-Sharing Agreement With RLD

ఉత్తర్ ప్రదేశ్ లో బలంగా నాటుకుపోయిన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనడానికి సమాజ్ వాది పార్టీ-బహుజన్ సమాజ్ వాది పార్టీలు జట్టు కట్టిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని 80 లోక్ సభ స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. దీనికి సంబంధించి.. ఇదివరకే సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసుకున్నాయి.

అమేథీ, రాయ్ బరేలీ మినహా..

ఏఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే విషయాన్ని కూడా తేల్చేశాయి. బీఎస్పీ 38 స్థానాలు, ఎస్పీ 37 చోట్ల పోటీ చేయనున్నాయి. మరో అయిదు స్థానాలను తాత్కాలికంగా ఖాళీగా ఉంచాయి. వాటిల్లో రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ, సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహిస్తోన్న రాయ్ బరేలీ లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయిదింట్లో ఈ రెండు పోగా, మిగిలిన మూడింటినీ రాష్ట్రీయ లోక్ దళ్ కు కేటాయించారు.

ఆర్ఎల్డీకి కేటాయించాలని భావిస్తోన్న మథుర, బాగ్ పట్, ముజప్ఫర్ నగర్ స్థానాలు ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్నాయి. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఈ మూడు చోట్లా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు చోట్ల కూడా బీఎస్పీ రెండో స్థానంలో, ఆర్ఎల్డీ మూడో స్థానంలో నిలిచాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మూడుస్థానాల్లో తాము పోటీ చేయకుండా ఆర్ఎల్డీ అభ్యర్థికి మద్దతు పలికితే.. గెలుపు సునాయాసమౌతుందనేది ఎస్పీ-బీఎస్పీ వ్యూహాం. నిజానికి- బాగ్ పట్ లోక్ సభ స్థానం ఆర్ఎల్డీకి కంచుకోట. 2014 ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీకి కోల్పోయింది.

English summary
ashtriya Lok Dal (RLD) is set to join the BSP-SP alliance in Uttar Pradesh ahead of the upcoming Lok Sabha elections, party leader Jayant Chaudhary said on Tuesday, 5 March. He further added that the RLD will contest the Lok Sabha polls in the crucial state from three seats. “Rashtriya Lok Dal will join the BSP-SP alliance in Uttar Pradesh. Our workers will work hard to ensure the victory of the alliance in all seats of the state,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X