వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు స్థానాల్లో పోటీకి అఖిలేష్ సిద్దం, పార్టీ వ్యతిరేకులకు టిక్కెట్లు ఇవ్వనంటున్న శివపాల్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 403 మంది అభ్యర్థులతో తన జాబితాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కు పంపారు. తాను బుందేల్ ఖండ్ లోని రెండు అసెంబ్లీ స్థానాలనుండి పోటీచేయనున్నారు. అయి

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న విభేదాలు ఇంకా తగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం టిక్కెట్ల కేటాయింపు విషయంలో బాబాయ్ , అబ్బాయి ల మద్య ఇంకా విబేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన వ్యతిరేక వర్గీయులకే టిక్కెట్ల కేటాయింపులో బాబాయి శివపాల్ ప్రాధాన్యత ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నారు. తన వర్గానికి చెందిన 403 మంది అభ్యర్థుల జాబితాను పంపి టిక్కెట్లు ఇవ్వాలని అఖిలేష్ బాబాయ్ ను కోరాడు. అయితే ఈ జాబితాపై శివపాల్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల కోసం ఆయా రాజకీయపార్టీలు సన్నద్దమయ్యాయి.సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న సమస్యలు ఇంకా పరిష్కరమైనట్టు కన్పించడం లేదు. బాబాయ్, అబ్బాయి ల మద్య సమస్యలు ఇంకా ప్రచ్చన్నయుద్దం సాగుతూనే ఉంది.

టిక్కెట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు వ్యతిరేక వర్గీయులకు ఆయన పెద్దపీట వేస్తున్నాడు. అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్లను కేటాయించబోమని శివపాల్ యాదవ్ చెబుతున్నారు.

పార్టీలోకి మాఫియా , క్రిమినల్ చరిత్ర ఉన్నవారిని చేర్చుకోవడంపై అఖిలేష్ గుర్రుగా ఉన్నారు. అయితే టిక్కెట్ల కేటాయింపును శివపాల్ యాదవ్ కే ములాయం సింగ్ అప్పగించారు. అయితే తనను పక్కనబెడితే పార్టీలో భూకంపం సృష్టిస్తానని అఖిలేష్ యాదవ్ బహిరంగంగానే ప్రకటించారు.

రెండు స్థానాల నుండి అఖిలేష్ యాదవ్ పోటీ

రెండు స్థానాల నుండి అఖిలేష్ యాదవ్ పోటీ

తనకు సన్నిహితంగా ఉండే తనను సమర్థించే ఎంఏల్ఏలతో అఖిలేష్ యాదవ్ రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. పార్టీ టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఇబ్బందులు పడకూడదని ఎంఏల్ఏలకు ఆయన భరోసా ఇచ్చారు. అయితే ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాల్లో తనకు వ్యతిరేకులకు బాబాయి శివపాల్ యాదవ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారని అఖిలేష్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు తనకు సంబంధించిన 403 మంది అభ్యర్థుల జాబితాను తాజాగా అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ కు పంపారు. అయితే ఈ జాబితా పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరో వైపు ఈ ఎన్నికల్లో బబినా, మహూబా అనే రెండు అసెంబ్లీ స్థానాల నుండి అఖిలేష్ యాదవ్ పోటీచేయనున్నారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాలు బుందేల్ ఖండ్ ప్రాంతంలో ఉన్నాయి.

క్రమశిక్షణ ఉల్లంఘించినవారికి టిక్కెట్లా

క్రమశిక్షణ ఉల్లంఘించినవారికి టిక్కెట్లా

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్లను కేటాయించడం సరైంది కాదనే అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సిఎం అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ చెబుతున్నారు. అఖిలేష్ యాదవ్ పంపిన 403 అభ్యర్థుల జాబితా పట్ల శివపాల్ యాదవ్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అఖిలేష్ పంపిన జాబితాలో అత్యధికులు పార్టి క్రమశిక్షణను ధిక్కరించినవారే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరంతా అఖిలేష్ మద్దతుదారులు కావడం కావడంతో వారందరికీ టిక్కెట్లు కేటాయిస్తే ఇబ్బందిగా శివపాల్ భావిస్తున్నారు. దరిమిలా ఆయన క్రమశిక్షణ అంశాన్ని తెరమీదికి తెచ్చి టిక్కెట్లు ఇవ్వకుండా కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అఖిలేష్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

కాంగ్రెస్ తో పొత్తుకు అఖిలేష్ ఆసక్తి

కాంగ్రెస్ తో పొత్తుకు అఖిలేష్ ఆసక్తి

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొనేందుకుగాను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, బిఎస్ పి లు ఒంటరిగా పోటీచేసే అవకాశాలున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు ప్రయోజనం ఉండే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడుతున్నారు. అయితే పొత్తుల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే రాష్ట్రంలో రెండు పార్టీలకు కలిసి వస్తాయనే అభిప్రాయాన్ని అఖిలేష్ యాదవ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ ప్రతిపాదనను ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్బర్ వ్యతిరేకించారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తోందని ఆయన ప్రకటించారు.

వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు

వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయపార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీతొ పొత్తు కోసం సమాజ్ వాదీ పార్టీ ప్రయత్నించడాన్ని బిఎస్ పి అధినేత్రి మాయావతి తప్పుబట్టారు. పరోక్షంగా బిజెపికి ప్రయోజనం కలిగించేందుకే కాంగ్రెస్ పార్టీతో సమాజ్ వాదీ పార్టీ పొత్తుకు సిద్దమైందని మాయావతి ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. మూడు రోజుల క్రితం వారణాసిలో బిజెపి పదాదికారుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో నిర్వహించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరో వైపు సంఘ్ పరివార్ కూడ చాలా కాలంగా యూపిలో ఓబిసి, దళితులను లక్ష్యంగా చేసుకొని సామాజిక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాలు బిజెపికి కలిసివచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
akhilesh yadav to contest from two seats in bundelkhand, as per sources akhilesh contest from babina and mahoa seats for upcoming assembly elections, akhilesh sent to his list of 403 candidates uncle shivpal yadav for upcoming assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X