వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్‌కు షాక్, బాబాయి శివపాల్ యాదవ్ కొత్త పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు భారీ షాక్. ఆయన సొంత బాబాయి శివపాల్ యాదవ్ కొత్త పార్టీని పెట్టారు. శివపాల్... ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు. ఆయన సమాజ్ వాది పీర్టీని చీల్చారు. తాను పార్టీ తప్పుకుంటున్నానని బుధవారం ప్రకటించారు.

అఖిలేష్, శివపాల్ యాదవ్‌ల మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. తాను పార్టీ పెడుతున్నానని, తన పార్టీ పేరు సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా అని చెప్పారు.

Akhilesh Yadav dismissive of uncle Shivpals new morcha

తనకు పార్టీలో ఎలాంటి పని కల్పించడం లేదని, అందుకే తాను సమాజ్‌వాదీ సెక్యులర్‌ మోర్చా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నానని, సమాజ్‌వాదీ పార్టీ ఐకమత్యంగా ఉండాలని అనుకున్నానని, అందుకే తాను చాలా రోజులు ఎదురుచూశానని, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కకు పెడుతున్న వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు.

గతంలో పలుమార్లు అఖిలేష్, శివపాల్ మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ యూపీ రాష్ట్ర యూనిట్‌ అధ్యక్షుడి పదవి నుంచి శివపాల్‌ను అఖిలేశ్‌ తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పుడు ములాయం తమ్ముడు శివపాల్‌కు ములాయం బాసటగా నిలిచారు. దీంతో అఖిలేశ్‌, ములాయంల మధ్య కూడా విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి పార్టీలో శివపాల్‌కు ప్రాధాన్యం లభించడం లేదని అంటున్నారు.

English summary
Akhilesh Yadav is once again getting strong warning signals from estranged uncle Shivpal Yadav, after a brief truce. Shivpal Yadav, the brother of former Samajwadi Party chief Mulayam Singh Yadav, has sent out feelers that he may quit the Samajwadi Party and form a new outfit that will work with the BJP in Uttar Pradesh for the 2019 national election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X