వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తులొద్దు బాబాయ్..! ఉప ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామన్న అఖిలేష్ యాదవ్..!!

|
Google Oneindia TeluguNews

లక్నో/హైదరాబాద్ : ఎన్నికల్లో అన్ని ప్రయోగాలు ముగిసిపాయాయి. పొత్తులతో పార్టీలు చిత్తయ్యాయి. అనైతిక పొత్తులతో రాజకీయ పార్టీలు ఉనికిని కొల్పోయే ప్రమాదంలో పడ్డాయి.ఎన్నికలు ఐపోయిన తర్వాత గానీ ఈ వాస్తవాలు రాజకీయ నాయకులకు తెలిసనట్టు లేదు. ఎన్నికల్లో ప్రజలకు తామేం చేస్తామో చెప్పడం మర్చిపోయి ఇతర పార్టీల పై దుమ్మెత్తి పోయడాన్ని జనం జీర్ణించుకోలేక పోయారు.

అందుకు బలమైన ప్రాంతీయ పార్టీలను సైతం ప్రజలు ఘోరంగా ఓడించారు. ఇక ఉత్తర ప్రదేశ్ లో మొన్నటి వరకూ అదికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ మొదట కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అనూహ్యంగా ఓటమి పాలయ్యింది. ఆతర్వాత జరిగిన సార్వత్రిక ెన్నికల్లో బహుజన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్న ఆదిఖ్యాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో భవిష్యత్తులో పొత్తు అంటేనే ఝడుసుకునే పరిస్థితులు తలెత్తాయి.

Akhilesh Yadav to go alone in the by election elections !!

దీంతో ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలలో తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి రాబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాం అని తేల్చి చెప్పేయడంతో ఎస్పి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఒకవేళ తమ బంధం తెగదెంపులు అయితే.. దానిపై లోతుగా విశ్లేషణ చేస్తామన్నారు. రాబోయే ఉప ఎన్నికల కోసం తాము సిద్ధమవుతున్నామని, 11 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తామని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజేపీకి అడ్డు కట్ట వేయాలని జతకట్టిన ఎస్పీ - బీఎస్పీ కూటమి ఘోర విఫలమైన విషయం తెలిసిందే. అఖిలేష్ యాదవ్ ఆదేశాలను ఎస్పీ కేడర్ పాటించలేదని, ఆ పార్టీ నేతలు బీఎస్పీకి ఓట్లేయలేదని మాయావతి పేర్కొన్న విషయం విదితమే. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్లు పలువురు కుడా ఘోర ఓటమి చవి చూశారు.

English summary
Samajwadi Party chief Akhilesh Yadav said that they will be left alone in the by-elections in Uttar Pradesh. The SP comes to the conclusion that Bahujan Samaj Party chief Mayawati is contesting in the upcoming by-elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X