వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూ ఇష్యూ: ఏబీవీపీతో అక్షత్‌కు సంబంధం లేదు, విచారణకు పోలీసులకు కో ఆపరేట్ చేస్తాం

|
Google Oneindia TeluguNews

జేఎన్‌యూలోని సబర్మతి హాస్టల్ వద్ద వామపక్ష విద్యార్థుల దాడి చేసింది తామేనని అక్షత్, రోహిత్ 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్‌లో అంగీకరించిన నేపథ్యంలో దుమారం చెలరేగింది. దీంతో ఏబీవీపీ స్పందించింది. అక్షత్, రోహిత్‌తో ఏబీవీపీకి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో తెలిపింది.

అక్షత్ తాను ఏబీవీపీ కార్యకర్తనని రిపోర్టర్‌తో చెప్పడంతో సంచలనం కలిగించింది. అయితే దీనిపై ఏబీవీపీ ప్రధాని కార్యదర్శి నిధి త్రిపాఠి స్పందించారు. జేఎన్‌యూ దాడితో ఏబీవీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అక్షత్ ఏబీవీపీ కార్యకర్త కాదని.. అతనికి ఏబీవీపీతో సంబంధం ఉందని ముద్రవేసి, హింసకు పాల్పడిందని ఏబీవీపీ అని నిందించడం తప్పు అన్నారు. అంతేకాదు జేఎన్‌యూ దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని గుర్తుచేశారు. ఘటన మొత్తం నిష్ఫాక్షిపాతంగా విచారించాలని తాము కోరుతున్నామని చెప్పారు.

Akshat Awasthi is not our member: abvp

జేఎన్‌యూ ఘటనపై విచారణ జరిపేందుకు ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ పరిపాలన విభాగానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అక్షత్ గురించి మీడియా ప్రతినిధులు మరోసారి ప్రశ్నించగా.. అలాంటి వారు ఎవరూ ఏబీవీపీలో లేరని, ఏబీవీపీలో ఉన్నారని ఎవరైనా చెబితే, దర్యాప్తు జరిపించాలని కోరారు. అంతేకాదు తప్పు చెప్పినందుకు బాధ్యత కూడా వహించాలని ఆమె అన్నారు. ఏబీవీపీతో అక్షత్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

English summary
Akshat Awasthi not our member, claims ABVP after India Today sting exposes JNU violence
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X