వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు భారీ డిస్కౌంట్లు ఇవే

హిందూ పురాణాల ప్రకారంగా అక్షయ తృతీయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే అదృష్ట దేవత వెన్నంటే ఉంటుందని నమ్ముతారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హిందూ పురాణాల ప్రకారంగా అక్షయ తృతీయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే అదృష్ట దేవత వెన్నంటే ఉంటుందని నమ్ముతారు.అక్షయ తృతీయరోజున సాధారణ రోజుల కంటే ఎక్కువగానే బంగారాన్ని కొనుగోలు చేస్తారు.

అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలు చేస్తే లాభాల పంట పండుతోందని విశ్వాసం.అయితే ఈ విశ్వాసాన్ని సొమ్ము చేసుకొనేందుకుగాను బంగారు దుకాణాల యజమానులు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నారు.

బంగారు దుకాణాలే కాదు ఈ కామర్స్ దిగ్గజాలు కూడ భారీ ఆఫర్లను ప్రకటించాయి. బంగారం , ప్లాటినం, డైమండ్, జ్యూయలరీలపై భారీ ఆఫర్లను ప్రకటించాయి.

ఈ ఆఫర్ల కారణంగా తమ దుకాణాల్లో సేల్స్ ను పెంచుకొనే ప్రయత్నాలను చేస్తున్నాయి ఆయా సంస్థలు.విశ్వాసాలను ఆధారం చేసుకొని సొమ్ము చేసుకొనేందుకుగాను సంస్థలు ఆఫర్లను జోడిస్తున్నాయి.ఈ ఆఫర్లతో బంగారం వ్యాపారం అక్షయ తృతీయ రోజున మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

జ్యూయలరీస్ పై 25% మేకింగ్ ఛార్జీలు

జ్యూయలరీస్ పై 25% మేకింగ్ ఛార్జీలు

అక్షయ తృతీయ సందర్భంగా ప్లెయిన్ గోల్డ్ జ్యూయలర్స్ పై 25 శాతం వరకు మేకింగ్ ఛార్జీలను తగ్గిస్తున్నట్టు తనిష్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కుల్హాలి తెలిపారు. డైమండ్ జ్యూయలరీ విలువపై 25 శాతం వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇలాంటి ఆఫర్లకు ఇప్పటికి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తోంది.

మలబార్ గోల్డ్ 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్

మలబార్ గోల్డ్ 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఎస్బీఐ డెబిట్ కార్డు హెల్డర్స్ కు అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ ను కేవలం గుర్గావ్ , ఢిల్లీ స్టోర్లకు మాత్రమే పరిమితం చేసింది. తమ ఆన్ లైన్ ఫోర్టల్ లో బంగారం జ్యూయల్లరీ మేకింగ్ ఛార్జీలపై 30 శాతం డైమండ్ విలువపై 15 శాతం పన్ను తగ్గింపును ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం లోపుగా అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకొన్న ఆభరణాలపై వెండిని ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.

బంపర్ ఆఫర్లు ఇవే

బంపర్ ఆఫర్లు ఇవే

సెన్కో గోల్డ్, జోయలూక్కాస్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ , టీబీజడ్ -ది ఒరిజినల్ వంటి బ్రాండులను కలిగి ఉన్న అమెజాన్ సంస్థ, జ్యూయల్లరీ కొనుగోలు చేసే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్. డెబిట్ కార్దుదాలకు 5 -20 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ ను అక్షయ తృతీయ వరకే కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఒర్రా సైతం తన ఆన్ లైన్ పోర్టల్ లో బంగారం కాయిన్లకు ఎలాంటి మేకింగ్ ఛార్జీలు వేయబోమని ప్రకటించింది.ఈ ఆఫర్ ఏప్రిల్ 30వరకు అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.పేటీఏం ఏకంగా ఒక్క రూపాయికే బంగారాన్ని విక్రయిస్తానని ప్రకటించింది.

కారు బుక్ చేసుకొంటే గ్రాము బంగారం

కారు బుక్ చేసుకొంటే గ్రాము బంగారం

ముంబాయికి చెందిన వర్క్యూవల్ మార్కెట్ ప్లేస్ ఏకంగా ట్రూబిల్ డైరెక్ట్ నుండి కారు బుక్ చేసుకొన్న ప్రతి కస్టమర్ కు 24 క్యారెట్ల ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ కేవలం అక్షయ తృతీయ రోజేనని ప్రకటించింది. తమ ప్లాట్ పామ్ పై గోల్డ్ రింగ్ , నెక్లెస్, చైన్, పెండెంట్స్, ఇయర్ రింగ్స్ వంటి బంగార ఆభరణాలను కొనుగోలు చేస్తే 70 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్టు ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్ కార్డు ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ , బుజ్ , క్రెడిట్ కార్డు హెల్డర్స్ కైతే అదనంగా 5 శాతం తగ్గిస్తామని ప్రకటించింది.

English summary
It’s an auspicious golden Friday. Akshaya Tritiya is believed to bring good luck and success and hence it’s the perfect day to buy gold. It is believed that buying gold for investment or an upcoming occasion yields great results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X