వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరాలకు ఉగ్రముప్పు: అప్రమత్తం చేసిన ఎన్ఎస్‌జి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలు కలిసి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్‌ఎస్‌జి) డైరెక్టర్ జనరల్ జయంత్ చౌధురి హెచ్చరించారు. గురువారం ఎన్‌ఎస్‌జి 30వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆల్‌ఖైదా, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలోని నగరాలపై సంయుక్తంగా దాడికి దిగే ప్రమాదం ఉందని అన్నారు.

‘భారత్‌పై దాడి చేయాలన్న తమ ఉద్దేశాన్ని వారు (అల్‌ఖైదా) ఇప్పుడు బయటపెట్టారు. వారు లష్కర్ ఎ తోయిబా, ఐఎస్‌ఐఎస్, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో కలిసి దాడికి దిగే అవకాశాలు ఉన్నాయి' అని జయంత్ పేర్కొన్నారు. ఈ ఉగ్రవాద సంస్థలు ఉమ్మడి ఆపరేషన్లకు దిగితే మనం బహుళ నగరాలలో, బహుళ ఉగ్రవాద దాడులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

 Al Qaeda-ISIS may launch joint terror attack on India: NSG chief

గోవా, బెంగళూరు, అమృత్‌సర్ వంటి ప్రధాన నగరాలపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన వివరించారు. ఉగ్రవాదం భయంకరమైనదని, ముంబై నగరంపై జరిగిన 26/11 ఉగ్రవాద దాడే ఇందుకు ఉదాహరణ అని చౌదరి అన్నారు. ఎలాంటి ఉగ్రవాద దాడులనయినా, ఎప్పుడయినా తిప్పికొట్టేందుకు ఎన్‌ఎస్‌జి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

పండుగల సీజన్‌లో భారత్‌పై దాడి చేయడానికి అల్‌ఖైదా ప్రణాళిక రూపొందించుకుందని నిఘా సంస్థలు హెచ్చరించిన కొద్ది రోజులకే ఎన్‌ఎస్‌జి డైరెక్టర్ జనరల్ కూడా అలాంటి హెచ్చరికనే చేశారు. అల్‌ఖైదా భారత్‌పై తన దాడి ప్రణాళికను అమలు చేయడానికి సిమి వంటి నిషిద్ధ సంస్థలతో చేతులు కలుపుతుందని ఇంటెలిజెన్స్ సంస్థలు కొన్ని రోజుల క్రితం హెచ్చరించాయి. భారత్‌లో ఇండియన్ ముజాహిదీన్‌కు ఉన్న పట్టు అంతంత మాత్రమే కావడంతో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న సిమితో చేతులు కలపడానికి అల్‌ఖైదా చూస్తున్నదని నిఘా సంస్థలు వెల్లడించాయి.

ఇటీవల జరిగిన బర్ద్వాన్, బిజ్నోర్ బాంబు పేలుళ్ల సంఘటనల్లో ఉగ్రవాద సంస్థలు చేతులు కలిపాయనడానికి ఆధారాలు లభించాయని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. భారత్‌లో అల్‌ఖైదా శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ ఉగ్రవాద సంస్థ చీఫ్ అల్ జవహరీ సెప్టెంబర్ 4న ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇస్లామిక్ పాలనను విస్తరించాల్సిన, భారత ఉపఖండం వ్యాప్తంగా జిహాద్ పతాకాన్ని ఎగురవేయాల్సిన అవసరం ఉందని అల్ జవహరీ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. అంతేగాక, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ జెండాలు కాశ్మీర్‌లో ఎగరడం ఆందోళన కలిగించే విషయంగానే చెప్పుకోవచ్చు.

English summary
The Director General of National Security Guards (NSG) Jayant Choudhury, Thursday, warned of a joint plan by al Qaeda and ISIS to target Indian cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X