ట్వీస్ట్: ప్రేమ, పెళ్లి, జైలు, తల్లి వ్యతిరేకం: అందుకే చెన్నై విద్యార్థిని అశ్విని దారుణ హత్య!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: చెన్నైలో మినరల్ వాటర్ వ్యాపారం చేస్తున్న అళగేశన్ బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న అశ్విని(19)ని దారుణంగా హత్య చేసిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అశ్విని తనను ప్రేమించి మోసం చేసిందని, ఆమె తల్లి పెళ్లికి వ్యతిరేకించిదని, జైల్లో పెట్టించారని, అందుకే చంపేశానని హంతకుడు అళగేశన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

తండ్రి చనిపోయాడు

తండ్రి చనిపోయాడు

తండ్రి చనిపోవడంతో అశ్విని తల్లి శంకరితో కలిసి నివాసం ఉంటోంది. అదే సమయంలో ఇంటికి మినరల్ వాటర్ సరఫరా చేసే అళగేశన్‌తో అశ్వినికి పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారని తెలిసింది. కొంత కాలం సినిమాలకు, షికార్లకు వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అశ్విని తల్లి, బంధువులు

అశ్విని తల్లి, బంధువులు

అయితే అశ్వినీ అళగేశన్ ను పెళ్లి చేసుకొవడానికి ఆమె తల్లి శంకరి, బంధువులు అంగీకరించలేదు. అశ్వినీ, అళగేశన్ గతంలో ఒకే ప్రాంతంలో నివాసం ఉండేవారు. ఇక్కడ ఉంటే అళగేశన్ అశ్వినీతో మరింత దగ్గర అవుతాడని ఆమె తల్లి, బంధువులు ఆందోళన చెందారు.

మకాం మార్చిన శంకరి

మకాం మార్చిన శంకరి

అశ్విని తల్లి శంకరి బంధువుల సహాయంతో ఇంటిని మధురవాయల్ ప్రాంతానికి మార్చారు. అయితే అళగేశన్ అక్కడికి వెళ్లి అశ్వినిని కలవడం మొదలు పెట్టాడు. అశ్వినితో మాట్లాడకూడదని ఆమె తల్లి శంకరి తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

ఇంటిలో తాళి కట్టాడు

ఇంటిలో తాళి కట్టాడు

కొంత కాలం క్రితం అళగేశన్ ఇంటిలో చొరబడి అశ్వినికి తాళికట్టాడు. అశ్వని పెద్దనాన్న సంపత్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అళగేశన్‌‌ను అరెస్టు చేశారు. ఆ సమయంలో తనకు అళగేశన్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసుల సమక్షంలో అశ్విని లేఖ రాసి ఇచ్చింది.

జైలుకు అళగేశన్

జైలుకు అళగేశన్

ఇష్టంలేని అమ్మాయికి బలవంతంగా తాళి కట్టాడని, ఇంటిలోకి చొరబడ్డాడని కేసు నమోదు చేసిన పోలీసులు అళగేశన్ ను జైలుకు పంపించారు. ఇటీవల అళగేశన్ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్లీ అశ్వినీ వెంటపడ్డాడు.

కాలేజ్ నిలిపేశారు

కాలేజ్ నిలిపేశారు

అళగేశన్ వేధింపులు ఎక్కవ కావడంతో రెండు వారాల నుంచి అశ్విని కాలేజీకి వెళ్లలేదు. గురువారం నుంచి అశ్విని కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టింది. గురువారం అశ్విని కాలేజీకి వచ్చిందని అళగేశన్‌కు సమాచారం అందింది.

వెంటాడి చెంపేశాడు

వెంటాడి చెంపేశాడు

శుక్రవారం అశ్వినీ కాలేజ్ కు వచ్చిందని తెలుసుకున్న అళగేశన్ కత్తి తీసుకుని కేకే నగర్ లోని మీనాక్షి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరకు వెళ్లాడు. కాలేజ్ లో నుంచి బయటకు వచ్చిన అశ్వినీని పట్టుకున్న అళగేశన్ ఇష్టం వచ్చినట్లు కత్తితో దాడి చేసి గొంతుకోసి చంపేశాడు. స్థానికుల దాడిలో తీవ్రగాయాలైన అళగేశన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Alagesan told in a confession statement that why he killed Ashwini? because of ashwini's mom rejected their love only he decided to kill ashwini and to end his life too.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి