వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడే తిన్నా, ప్రశాంతంగా నిద్రపోతా: వేటుపై అళగిరి

|
Google Oneindia TeluguNews

Alagiri's 1st reaction on expulsion from DMK: 'Just had lunch, want to sleep peacefully'
చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి (89) తన కుమారుడు అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున అతడిపై శాశ్వతంగా వేటు వేస్తున్నట్టు కరుణానిధి మంగళవారం తెలిపారు. సస్పెండ్ చేసిన రెండు నెలలకు, సాధారణ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అళగిరిని సస్పెండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీ జనరల్ సెక్రటరీ కె అంబాజ్గన్‌తో కలిసి తానీ నిర్ణయం తీసుకున్నానని కరుణానిధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు(అళగిరి) పార్టీ తరపున కీలక బాధ్యతలు ఏమైనా నిర్వహిస్తారా? అనే సందేహాలు పార్టీ సభ్యుల్లో ఉన్నందున అళగిరిపై శాశ్వతంగా వేటు వేయడం జరిగిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో అళగిరి మీడియాతో మాట్లాడుతూ.. ‘డిఎంకె పార్టీ నుంచి నా తొలగింపుపై ఎలాంటి ప్రతిచర్య ఉండదు. నేను ఇప్పుడే భోజనం చేశాను. ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకుంటున్నాను. నాకేం నష్టం లేదు. వారే(డిఎంకె అధిష్టానం) నష్టపోతారు' అని అన్నారు. కొత్త పార్టీ పెట్టే యోచనలో ఏమైనా ఉన్నారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

అళగిరితో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించకూడదని డిఎంకె అధిష్టానం తన పార్టీ శ్రేణులకు వారం క్రితమే ఆదేశాలు జారీ చేసింది. కాగా, జనవరి 24న డిఎంకె అధిష్టానం అళగిరి(63)ని సస్పెండ్ చేసింది. కరుణానిధి మరో కుమారుడైన ఎంకె స్టాలిన్(61) పార్టీ కీలక పదవిని చేపట్టేందుకు అళగిరి అడ్డుపడటంతో అతనిపై సస్పెండ్ వేటు పడింది.

కాగా, ఇటీవలే ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా అళగిరి కలిశారు. అయితే ఏదైనా పార్టీలో చేరాలా లేక కొత్త పార్టీ పెట్టాలా అనేదానిపై ఇంకా అళగిరి స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. తన మద్దతుదారులతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని అళగిరి తెలిపారు.

English summary
In a significant development ahead of General Elections, DMK president M Karunanidhi on Tuesday permanently expelled elder son MK Alagiri from the party, two months after suspending him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X