మద్యం డోర్ డెలివరీలో ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, బిగ్ బాస్కెట్ లు .. మందుబాబులకు గుడ్ న్యూస్
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇక నుండి మద్యం కూడా డోర్ డెలివరీ చెయ్యనుందని తెలుస్తుంది. అమెజాన్.కామ్ భారతదేశం యొక్క తూర్పు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లో మద్యం పంపిణీ చేయడానికి క్లియరెన్స్ పొందిందని రాయిటర్స్ పేర్కొంది. యుఎస్ ఈ-కామర్స్ దిగ్గజం దేశంలోని తాజా పరిస్థితుల నేపధ్యంలో లిక్కర్ డోర్ డెలివరీకి తొలి అడుగు వేసినట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ బిజినెస్ పై పశ్చిమ బెంగాల్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ నోటీసు
90 మిలియన్లకు పైగా జనాభా ఉన్న పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నాల్గవ రాష్ట్రం కాగా ఇక అక్కడ తాజా కరోనా పరిస్థితుల నేపధ్యంలో తీసుకుంటున్న నిర్ణయం మద్యం ఆన్ లైన్ వ్యాపారం . పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం యొక్క ఆన్లైన్ రిటైల్ నిర్వహణకు అధికారం కలిగిన పశ్చిమ బెంగాల్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ శుక్రవారం ఒక నోటీసులో, అధికారులతో రిజిస్ట్రేషన్ చేయడానికి అర్హత ఉన్న సంస్థలలో అమెజాన్ కూడా ఉందని తెలిపింది.

మద్యం డోర్ డెలివరీ ఆన్ లైన్ వ్యాపారానికి పశ్చిమబెంగాల్ గ్రీన్ సిగ్నల్
ఆలీబాబా మద్దతుగల భారతీయ కిరాణా వెంచర్ బిగ్‌బాస్కెట్ కూడా రాష్ట్రంలో మద్యం పంపిణీ చేయడానికి అనుమతి పొందిందని నోటీసులో పేర్కొంది.అమెజాన్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఆహ్వానించబడిందని పశ్చిమ బెంగాల్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ తన నోటీసులో పేర్కొంది. ఇది గతంలో నివేదించబడలేదు.ఇక ఈ విషయంపై ఇప్పటివరకు అమెజాన్ స్పందించలేదు. ఇక ఇదే కోవలో మద్యం డోర్ డెలివరీ చెయ్యాలని ఆసక్తి చూపుతున్న బిగ్‌బాస్కెట్ కూడా స్పందించలేదు.

భారతదేశంలో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో అమెజాన్ .. లిక్కర్ బిజినెస్ లో అంచనాలివే
ఐడబ్ల్యుఎస్ఆర్ డ్రింక్స్ మార్కెట్ అనాలిసిస్ అంచనాల ప్రకారం, పశ్చిమ బెంగాల్లో మద్యం పంపిణీ చేయడంలో అమెజాన్ ఆసక్తి 27.2 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్లోకి ప్రవేశించడానికి అని , ఇది ఒక సాహసోపేతమైన చర్య అని పేర్కొంది . గత కొన్నేళ్లుగా అమెజాన్ భారతదేశంలో తన ఇ-కామర్స్ కార్యకలాపాలను విస్తరించింది, ఇక తాజా పరిణామాల నేపధ్యంలో మరింతగా దూసుకుపోవాలని భావిస్తున్న అమెజాన్ కిరాణా నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతిదానికీ ఎక్కువ మంది ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సమయంలో తన ముఖ్య వృద్ధి మార్కెట్లలో ఒకటైన భారతదేశంలో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు పాల్పడింది.

లిక్కర్ వ్యాపారంలోకి షాపింగ్ దిగ్గజాలు
కరోనావైరస్ ను ఎదుర్కోవటానికి ఉద్దేశించిన లాక్డౌన్ నుండి అనేక రాష్ట్రాలు బయటకు రావడంతో, భారతదేశపు మొదటి రెండు ఫుడ్ స్టార్టప్ లు స్విగ్గి మరియు జోమాటో, కొన్ని నగరాల్లో మద్యం పంపిణీ చేయడం ప్రారంభించాయి. అయినా దేశంలో కరోనా తగ్గని పరిస్థితుల నేపధ్యంలో బయట తిరగటం సేఫ్టీ కాదనే భావన కనిపిస్తుంది.ఆన్లైన్ డెలివరీలను అనుమతించడానికి మద్యం పరిశ్రమ, పలు లిక్కర్ సంస్థలు అనేక రాష్ట్రాలతో లాబీయింగ్ చేస్తున్నాయి .ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో సొంత మద్యం పాలసీ ఉండగా , కరోనా వ్యాప్తి నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ గత నెలలో మద్యం లైసెన్స్ పొందిన రిటైల్ అవుట్లెట్ల నుండి పంపిణీ చేయడం కోసం రాష్ట్రంలోని అర్హతగల ఆన్ లైన్ కంపెనీలను ఆహ్వానించింది.అందులో భాగంగా అమెజాన్ , బిగ్ బాస్కెట్ రెండూ ఉన్నాయని తెలుస్తుంది .