• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అలెర్ట్ ఇండియా..పాకిస్థాన్ కు చైనా 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లు .. భారత్ పై శత్రు దేశాల కుట్రలు

|

చైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అయితే చైనా పాకిస్థాన్ దేశాల కార్యకలాపాలపై భారత్ దృష్టి పెట్టింది. తదనుగుణంగా ఇండియా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది.

చైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ బోర్డర్ వెంట ముళ్ళ తీగలతో 2 వేల కిలోమీటర్ల అతి పెద్ద గోడ నిర్మాణం

 ఎత్తైన ప్రదేశాలలో భారత భూ నిర్మాణాలకు ఒక పీడకల అని చెప్తున్న చైనా మీడియా

ఎత్తైన ప్రదేశాలలో భారత భూ నిర్మాణాలకు ఒక పీడకల అని చెప్తున్న చైనా మీడియా

తాజాగా ఈ నెలలో పాకిస్థాన్ దేశానికి 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లను సరఫరా చేయాలనే తన నిర్ణయాన్ని చైనా రాష్ట్ర మీడియా ప్రచారం చేసింది. ఇది ఎత్తైన ప్రదేశాలలో భారత భూ నిర్మాణాలకు ఒక పీడకల అవుతుందని కూడా పేర్కొంది . ఎందుకంటే భారత సైనికదళానికి వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లపై కొత్తగా స్పందించే సామర్థ్యం లేదని , వారి వద్ద ఆయుధాలు చాలా పాతవి అంటూ చైనా రాష్ట్ర మీడియా పేర్కొంది.

శత్రు రక్షణ , సాంప్రదాయిక కవచాలను నాశనం చేయడం ద్వారా సాయుధ చైనీస్ మరియు టర్కిష్ డ్రోన్లు లిబియా, సిరియా మరియు అజర్‌బైజాన్ ఘర్షణల్లో కీలక పాత్ర పోషించాయని చెప్పింది చైనా మీడియా.

 సాయుధ డ్రోన్‌ల దాడిని ఇండియా ఆపలేదన్న చైనా మీడియా ..

సాయుధ డ్రోన్‌ల దాడిని ఇండియా ఆపలేదన్న చైనా మీడియా ..

భారతీయ భూ నిర్మాణాలు, భారత సాయుధ బలగాలు పెద్ద సంఖ్యలో సాయుధ డ్రోన్‌ల దాడిని అణచివేయలేవని పేర్కొంది. అటువంటి 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లను పాకిస్తాన్ కు విక్రయిస్తుంది చైనా . అయితే, భారత సైనిక అధికారులు సాయుధ డ్రోన్లు అనియంత్రిత వాయు ప్రదేశాలలో లేదా వాయు ఆధిపత్యం ఉన్న చోట ఉత్తమంగా పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు.

చైనా లేదా పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుతో ఇది జరగదని భారత సైన్యం అభిప్రాయపడుతోంది.

గగనతలం రాడార్ల ద్వారా ఇండియా పరిశీలన ..దాడి చెయ్యటం అంత ఈజీ కాదన్న ఇండియా

గగనతలం రాడార్ల ద్వారా ఇండియా పరిశీలన ..దాడి చెయ్యటం అంత ఈజీ కాదన్న ఇండియా

జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ అయినా, లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ అయినా, గగనతలం రాడార్ల ద్వారా చాలా నిశితంగా పరిశీలించబడుతుంది . అదేవిధంగా సాయుధ బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయని, సాయుధ డ్రోన్లు గీతలు దాటితే కాల్చివేయబడతాయి అని భారత వైమానిక దళం మాజీ చీఫ్ అన్నారు. చైనా చెబుతున్నట్టు అది అంత ఈజీ కాదని పేర్కొంటున్నారు

.చైనా నుండి సాయుధ డ్రోన్లను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోవడం భారతదేశం ఆయుధరహిత డ్రోన్లు మరియు యాంటీ-డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే మానవరహిత వైమానిక వాహనాలు నియంత్రణ రేఖ లేదా ఎల్ఐసిని దాటకుండా గాలి నుండి భూమికి ఆయుధాలను ప్రయోగించటంలో కీలకంగా ఉపయోగపడతాయి.

 ఇండియాకు మానవ రహిత సాయుధ డ్రోన్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం

ఇండియాకు మానవ రహిత సాయుధ డ్రోన్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం

భారతదేశం కూడా అలాంటి మానవ రహిత సాయుధ డ్రోన్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి, భారతదేశానికి సాయుధ డ్రోన్ వ్యవస్థ లేదు. కాబట్టి వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఏది ఏమైనా చైనా తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలు , పాకిస్తాన్ తో కలిసి భారత్ పై చేస్తున్న కుట్రల నేపధ్యంలో భారత సైన్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అటు డ్రాగన్ కంట్రీతో ఇటు పాకిస్తాన్ దేశంతో ఇండియాను కాపాడుకోవటానికి యుద్ధ తంత్రాలను సమర్ధంగా సిద్ధం చేసుకోవాల్సిన అవసరంతో పాటు ,వారికి ధీటుగా అత్యాధునిక ఆయుధాలను రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది .

English summary
This month, China’s state media publicised its decision to supply 50 Wing Loong II armed drones to Pakistan, which it prophesied, would be a nightmare for Indian ground formations in high-altitude areas .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X