వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: కేజ్రీవాల్ వైపు అల్కా, ఆమె ఎవరని బేణి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Alka Lamba
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ సీనియర్ నేత అల్కా లంబ గురువారం మధ్యాహ్నం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆమె ఎఎపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. అల్కా ఎఎపి సీనియర్ నాయకులు యోగేంద్ర యాదవ్‌ను కలిసి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 29న ఆమె ఎఎపిలో చేరనున్నారంటున్నారు. ఎఎపి వైపు వెళ్లే విషయమై అల్కా కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారట.

తమ పార్టీలోకి అల్కా ఒక్కరే కాదని బిజెపి, కాంగ్రెసు పార్టీలలోని ఎందరో సీనియర్ నాయకులు వస్తారని యోగేంద్ర యాదవ్ చెబుతున్నారు. పార్టీలో చేరిన వారిని గమనించి నాలుగు నెలల తర్వాత మెంబర్‌గా గుర్తిస్తామని చెప్పారు. ఢిల్లీకి చెందిన పలువురు కాంగ్రెసు నాయకులు అల్కా దారిలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు.

కాంగ్రెసు పార్టీ తీరుతో తాను అసంతృప్తిగా ఉన్నానని అల్కా చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎఎపి నాయకుడు ఒకరు తనను కలిసి టిక్కెట్ ఇస్తామని, తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారని, అప్పుడు తాను అంగీకరించలేదన్నారు.

కాంగ్రెసు పార్టీ తనకు టిక్కెట్ ఇవ్వక పోవడం వల్లనే తాను ఎఎపిలోకి చేరానని ప్రజలు భావించకుండా ఉండేందుకు అప్పుడు తాను తిరస్కరించానన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెసు ఎఎపికి మద్దతివ్వడాన్ని ఆమె ప్రశ్నించారు. అల్కా గతంలో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షురాలిగా పని చేశారు. అయితే కాంగ్రెసు పార్టీలో ఆమెను ఏ పదవి వరించలేదు, ఎన్నికల్లో పోటీ చేయలేదు.

అల్కా లంబా విషయమై కేంద్రమంత్రి బేణి ప్రసాద్ వర్మ స్పందిస్తూ... తాను ఆమె పేరును మొదటిసారి వింటున్నానని, ఆమె ఎవరని ప్రశ్నించారు.

English summary
A surprise visit by Congress member Alka Lamba to the Aam Aadmi Party's Connaught Place office on Thursday afternoon raised eyebrows. Lamba, who met senior AAP member Yogendra Yadav, wanted to join the party and has said that she will formally become a member on December 29, after the new government is sworn in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X