వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రుజువుల్లేవు: గోవధ కేసులో ఒకే జిల్లాలోని 53 మందిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ : జార్ఖండ్‌లోని ఓ జిల్లాలో గోవధకు పాల్పడ్డారని లేదా ఉద్దేశపూర్వకంగానే గోవులను వధిచారన్న ఆరోపణలపై గత ఆరేళ్లలో 53 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అందరూ ఇప్పుడు నిర్దోషులుగా విడుదలై బయటకు వచ్చారు. ఈ 53 మందిపై కేసులు గత ఆరేళ్లలో నమోదయ్యాయి. తీరా కోర్టుకు వెళితే అక్కడ సరైన సాక్షాదారాలు లేకపోవడంతో న్యాయస్థానం వారిని విడుదల చేసింది. కానీ వాస్తవానికి ఇందులో చాలామంది గోవధకు పాల్పడేలదని సమాచారం.

అసెంబ్లీలో గోవధ నిషేధం బిల్లును ప్రవేశపెడతాం: ప్రభుత్వంఅసెంబ్లీలో గోవధ నిషేధం బిల్లును ప్రవేశపెడతాం: ప్రభుత్వం

 ఆ 89 రోజులు నరకం అనుభవించాను

ఆ 89 రోజులు నరకం అనుభవించాను

గోవధకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బాలి ముండా అనే ఈ జార్ఖండ్ వాసి కూడా ఒకరు. తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని తాను 89 రోజుల పాటు జైలు జీవితం గడిపినట్లు బాలి ముండా గుర్తు చేసుకుని కన్నీరుమున్నీరయ్యాడు. ఆ సమయంలో కుంతీ జిల్లా కోర్టుకు తన గ్రామం నుంచి 21 సార్లు వెళ్లినట్లు చెప్పిన బాలి ముండా... అందుకు కావాల్సిన డబ్బులు కూడా లేకపోవడంతో రూ.14వేలు అప్పు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు.

ఒక్క కేసులో కూడా ఆధారాలు లేవు

ఒక్క కేసులో కూడా ఆధారాలు లేవు

తనపై జనవరిలో కేసు నమోదైందని చెప్పాడు 63 ఏళ్ల బాలి ముండా. అయితే తను ఇంకా బతికి ఉన్నానంటే అది భగవంతుడి వల్లే అని చెప్పాడు. తనపై నమోదైన కేసులు రుజువుకాకపోవడంతో తను బయటపడ్డట్లు చెప్పాడు బాలి. ఇదిలా ఉంటే 2018 నుంచి ఇప్పటి వరకు 16 కేసులు నమోదు కాగా నేరారోపణలు రుజువుకాకపోవడంతో అందరినీ విడుదల చేయడం జరిగింది. స్వాధీనం చేసుకున్న గోమాంసం ఎఫ్ఎస్ఎల్‌ ల్యాబ్‌కు పంపనందున ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విడుదల చేయడం జరిగింది. ఇంకొన్ని కేసుల్లో సాక్ష్యం చెప్పేందుకు ఎవరూ రాలేదు.

అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డా

అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డా

ఆగష్టు 2017లో కుంతీ జిల్లాలోని జల్తాందా బజార్‌లో బాలి ముండా గోవధకు పాల్పడుతున్నారన్న నెపంతో కొందరు గోసంరక్షులు దాడి చేశారు. రెండేళ్ల తర్వాత ఇదే జిల్లాలోని సుఆరీ గ్రామంలో బర్లా అనే వ్యక్తి మూకదాడి చేసి చంపారు. ఇందులో మరో ఇద్దరు గాయపడ్డారు. బజరంగ్ దళ్ సభ్యులు దాడి చేస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పాడు బాలి ముండా. అయితే తనపై దాడి జరిగిన సమయంలో అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు.

English summary
A scrutiny of district court records by a national daily found that at least 53 people booked on charges of cow slaughter, or intent to slaughter cows under the Prevention of Cruelty to Animals Act, in 16 cases have been acquitted since 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X