చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయ ఆరోగ్యంపై అపోలో తాజా ట్వీట్లు: 11గం.కు ఎమ్మెల్యేలందరూ ఆస్పత్రికి

రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ సోమవారం ఉదయం 11గంటల వరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశించింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గుండె పోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఒక విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. జయ ఆరోగ్యంపై తమిళనాడు కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

కాగా, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ సోమవారం ఉదయం 11గంటల వరకు జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రికి చేరుకోవాలని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు అందరు మంత్రులూ ఆస్పత్రి వద్దే ఉన్నారు.

all ADMK MLAs ordered to be in apollo by 11 am.

అపోలో ఆస్పత్రి తాజా ట్వీట్లు

జయలలిత గొప్ప నాయకురాలని అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ సంగీతా రెడ్డి ట్వీట్టర్ వేదిక వ్యాఖ్యానించారు. అపోలో వైద్యులు జయలలితకు వైద్యం అందిస్తున్నారని, వారి ఉత్తమ ప్రయత్నంతో త్వరలోనే జయలలిత కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

8మంది వైద్యులు

జయలలిత ఆరోగ్యం విషమంగా ఉండటంతో 8మంది అపోలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లండన్ డాక్టర్ రిచర్డ్ బేలీని కూడా వారు సంప్రదించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు.

పోలీసులకు సెలవు లేదు

తమిళనాడులోని పోలీసులకు ఇవాళ్టి నుంచి ఎలాంటి సెలవులు ఉండవని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. మండల స్థాయి నుంచీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సూచించారు.

English summary
all ADMK MLAs ordered to be in apollo by 11 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X