తాడోపేడో తేల్చేయాలని సీఎం పళనిసామి నిర్ణయం, ఎవరు ఉంటారు, ఎవరు పోతారు !
చెన్నై: అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ గురువారం తనను కలవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఆదేశాలు జారీ చేశారు. రోజుకోక ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు మద్దతుగా మాట్లాడటం, అతన్ని వెనుకేసుకురావడంతో పళనిసామి సీరియస్ అయ్యారని తెలిసింది.
హీరో విశాల్ కు గాలం వేసిన టీటీవీ దినకరన్: దూకుడు మీద మన్నార్ గుడి మాఫియా !
గురువారం చెన్నై చేరుకుని సచివాలయంలో ఎమ్మెల్యేలు తనను కలవాలని సీఎం ఎడప్పాడి పళనిసామి సూచించారు. తన వర్గంలో ఎవరు ఉంటారు ? టీటీవీ దినకరన్ వర్గంలోకి ఎవరు వెలుతారు అనే విషయం గురువారం తేల్చేయాలని పళనిసామి నిర్ణయించారని సమాచారం.

ఇదే సందర్బంలో ఎడప్పాడి పళనిసామికి మద్దతుగా ఎమ్మెల్యేల దగ్గర సంతకాలసేకరణ చేపట్టాలని పలువురు మంత్రులు సిద్దం అయ్యారు. జయలలిత ఆశయాల కోసం ఐదు సంవత్సరాల పూర్తి కాలం అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అధికారంలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నారు.
పేరుకు మాత్రమే సీఎం వెంట ఎమ్మెల్యేలు: మావైపు 40 మంది వస్తారు: టీటీవీ దినకరన్ గ్యాంగ్ !
మరో వైపు దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలను తమ దారిలోకి తెచ్చుకోవడానికి పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా పుదుచ్చేరిలోని రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు రప్పించాలని చూస్తున్నారు. సోమవారం అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి గైహాజరైన ఎమ్మెల్యేలతో సీఎం పళనిసామి మాట్లాడుతున్నారు.