వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ కేంద్రాలను పెళ్లిమండపాలు చేసిన అధికారులు, ముచ్చటగా ఇలా అలంకరించారు!

|
Google Oneindia TeluguNews

మంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల వ్యవది మాత్రమే ఉంది. పోలింగ్ సవ్వంగా జరగడానికి ఇప్పటికే అధికారులు సర్వం సిద్దం చేశారు. శాసన సభ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే దక్షిణ కన్నడ జిల్లాలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పండగ వాతావరణం, పెళ్లి వేడుకలు గుర్తుకు వచ్చేలా అలంకరించారు. ఓటర్లను ఆకర్షించడానికి గురువారం రాత్రి నుంచి జిల్లా అధికారులు పోలింగ్ కేంద్రాలను సుందరంగా అలంకరించారు.

తులు సంసృతి

తులు సంసృతి

దక్షిణ కన్నడ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాలు తులు సంసృతి ఉట్టిపడేలా అలంకరించారు. బెళ్తంగడి తాలుకాలోని ఎన్నికల సంఘం అధికారులు తులు సంసృతి ప్రతిభించేలా ఆకర్షనీయంగా పోలింగ్ కేంద్రాలు అలంకరించారు. కొన్ని చోట్ల పెళ్లిమండపాలు గుర్తుకు వచ్చేలా అలంకరించారు.

సర్వం సిద్దం

సర్వం సిద్దం

దక్షిణ కన్నడ జిల్లాలో పోలింగ్ సవ్యంగా సాగడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దక్షిణ కన్నడ జిల్లాలో 8 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. దక్షిణ కన్నడ జిల్లాలో 17,11,878 మంది ఓటర్లు ఉన్నారు. 8,41,073 మంది పురుషులు, 8,70,675 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 100 మందికి పైగా హిజ్రాలు ఓటు వెయ్యనున్నారు.

1,858 పోలింగ్ కేంద్రాలు

1,858 పోలింగ్ కేంద్రాలు

దక్షిణ కన్నడ జిల్లాలో 1,858 పోలింగ్ కేంద్రాల్లో 7,569 ఓటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. శనివారం జరగనున్న శాసన సభ ఎన్నికల పోలింగ్ విధులకు మొత్తం 13,176 అధికారులు, సిబ్బంది హాజరౌతారని దక్షిణ కన్నడ జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ మీడియాకు చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదు మంది అధికారులు, ఒక డి-గ్రేడ్ ఉద్యోగి విధులు నిర్వహిస్తారని శశికాంత్ సెంథిల్ వివరించారు.

517 సున్నితమైన కేంద్రాలు

517 సున్నితమైన కేంద్రాలు

దక్షిణ కన్నడ జిల్లాలో మొత్తం 1,858 పోలింగ్ కేంద్రాలపైకి 517 సున్నితమైప పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ పూర్తి అయిన తరువాత ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రాలకు తరలించడానికి 648 వాహనాలను ఇప్పటికే సిద్దం చేశారు.

English summary
Karnataka assembly elections 2018: Dakshina Kannada district administration will set up 1858 polling booths for voting. All arrangements made for assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X