వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్బీ స్కామ్: నీరవ్ మోడీ లాయర్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో నీరవ్ మోడీపై వచ్చిన ఆరోపణలపై ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోడీపై నమోదైన కేసు కూడా భోఫోర్స్, 2జి కుంభకోణం కేసుల మాదిరిగానే కోర్టు ముందు కుప్పకూలుతుందని అన్నారు.

Recommended Video

2G advocate Vijay Aggarwal To Be Nirav Modi's Lawyer

టెలీకం కుంభకోణం కేసు సహా లు హై ప్రొఫైల్ కేసుల్లో నిందితుల తరఫున వాదించిన విజయ్ అగర్వాల్ పిఎన్బీ కేసులో నీరవ్ మోడీ తరఫున వాదించనున్నారు. పిఎన్బీ కుంభకోణం కేసులో మోపినట్లు తన క్లయింట్ నీరవ్ మోడీ ఏ విధమైన నేరానికి కూడా పాల్పడలేదని అన్నారు.

 నీరవ్ మోడీపై ఆరోపణలన్నీ తప్పు

నీరవ్ మోడీపై ఆరోపణలన్నీ తప్పు

నీరవ్ మోడీపై వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని విజయ్ అగర్వాల్ అన్నరు ఒకవేళ మోడీ మోసానికి పాల్పడితే రూ.5,600 కోట్ల విలువైన చరాస్తులను ఎందుకు వదిలేస్తారని ప్రశ్నించారు. వాటిని ఇప్పటికే ఈడి స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మాల్యాలాగా అన్ని పట్టుకుని వెళ్లేవాడు

మాల్యాలాగా అన్ని పట్టుకుని వెళ్లేవాడు

మోసం చేసిన పారిపావాలని అనుకుంటే నీరవ్ మోీ విజయ్ మాల్యా మాదిరిగా అన్న్ి పట్టుకుని విదేశాలకు పారిపోయి ఉండేవాడని విజయ్ అగర్వాల్ అన్నారు. రూ.5,600 కోట్ల వజ్రాలు, నగల భారతదేశంలోనే ఎందుకు వదిలి వెళ్లాడని ఆయన ప్రశ్నించారు. విచారణలో తన క్లయింట్‌పై వచ్చిన ఆరోపణలన్నీ కొట్టుకుపోతాయని అన్నారు.

సహేతుకంగా ఆలోచించడం లేదు

సహేతుకంగా ఆలోచించడం లేదు

ఏ ఒక్కరు కూడా నీరవ్ మోడీ వ్యవహారాన్ని సహేతుకంగా ఆలోచించడం లేదని విజయ్ అగర్వాల్ అన్నారు. బోఫోర్స్, టీజీ స్కామ్, చివరకు బొగ్గు కుంభకోణం కేసుల్లో కూడా ఈ విధంగానే ఆలోచించారని ఆయన అన్నారు. నీరవ్ మోడీ కేసులో కూడా అదే జరుగుతుందని అన్నారు.

నీరవ్ మోడీ అలా చేయవచ్చు...

నీరవ్ మోడీ అలా చేయవచ్చు...

ఓ వజ్రాల వ్యాపారి తన ఆస్తులను మార్చుకుని ఎత్తుకుని పోవడానికి ఎంత సమయం పడుతుందని విజయ్ అగర్వాల్ ప్రశ్నిస్తూ అననింటిని వజ్రాల రూపంలోకి మార్చుకుని పారిపోవచ్చు కదా, కానీ నీరవ్ మోడీ అలా చేయలేదని అన్నారు.

 ఎఫ్ఐఆర్ ఓ చిత్తుకాగితం

ఎఫ్ఐఆర్ ఓ చిత్తుకాగితం

నీరవ్ మోడీపై దాఖలైన ఎఫ్ఐఆర్ ఓ చిత్తు కాగితమని విజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ ఎక్కడ తలదాచుకున్నారనే విషయంపై మాత్రం అగర్వాల్ మాట్లాడలేదు. అయితే, ఆయనతో ఫోన్‌లో సంభాషించినట్లు మాత్రం తెలిపారు.

 అంత వరకు వ్యూహం ఏదీ లేదు

అంత వరకు వ్యూహం ఏదీ లేదు

చార్జిషీట్ దాఖలు చేసేవరక న్యాయపరమైన వ్యూహమేదీ ఉండదని విజయ్ అగర్వాల్ అన్నారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత వ్యూహం ఉంటుందని చెప్పారు. పిఎన్‌బితో జరిపిన లావాదేవీలన్నీ డాక్యుమెంట్ అయి ఉన్నాయని చెప్పారు.

English summary
Nirav Modi, one of the prime accused in the country's largest ever bank fraud, denies allegations levelled against him by Punjab National Bank (PNB), his lawyer Vijay Aggarwal said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X