వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: క్షణాల్లో పేకమేడలా కూలిన మరదు అపార్ట్‌మెంట్స్, నిబంధనలకు విరుద్ధంగా

|
Google Oneindia TeluguNews

Recommended Video

వీడియో వైరల్ : క్షణాల్లో పేకమేడలా కూలిన మరదు అపార్ట్‌మెంట్స్!!

కొచ్చి: కేరళలోని వివాదాస్పదంగా మారిన అక్రమ కట్టడం మరదు ఫ్లాట్స్‌‌ను శనివారం ఉదయం కేరళ ప్రభుత్వం కూల్చివేసింది. కొచ్చిలో మొత్తం నాలుగు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఉండగా ఇందులో రెండింటిని అధికారులు కూల్చివేశారు. అంతా చూస్తుండగానే కొన్ని సెకన్లలో ఈ అక్రమ కట్టడం పేకమేడలా కూలింది. కొచ్చి సముద్రతీరంలో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 340 ఫ్లాట్లు ఉండగా అందులో 240 కుటుంబాలు నివాసముంటున్నాయి. భారత దేశ చరిత్రలో ఈ స్థాయిలో ఒక కట్టడాన్ని ప్రభుత్వం కూల్చడం ఇదే తొలిసారి కావడం విశేషం.

నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం


తీరప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మించిన మరదు అపార్ట్‌మెంట్స్‌ను కూల్చాలని సుప్రీంకోర్టు నాలుగు నెలల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు రోజుల పాటు కూల్చే ప్రక్రియ జరగనుంది. అంతకుముందు ప్రభుత్వం తగు జాగ్రత్త చర్యలు తీసుకుంది. శనివారం ఉదయం 11 గంటలకు తొలి అపార్ట్‌మెంట్‌ను ప్రభుత్వం కూల్చగా ఆ వెంటనే రెండో అపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చారు. ఇక మిగతా రెండు అపార్ట్‌‌మెంట్స్‌ను ఆదివారం కూల్చనున్నారు.

అపార్ట్‌మెంట్లను కూల్చేందుకు 800 కిలోల పేలుడు పదార్థాలు


ఇక ఈ అపార్ట్‌మెంట్లను కూల్చేందుకు ప్రభుత్వం 800 కిలోల పేలుడు పదార్థాలను వాడినట్లు సమాచారం. ఈ పేలుడు పదార్థాలను అపార్ట్‌మెంట్లలో ముందుగా ఉంచి చాలా జాగ్రత్తగా పేల్చారు. అపార్ట్‌మెంట్ కూలిన తర్వాత వాటి శిథిలాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలోనే పడేలా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు

పరిసర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు

అపార్ట్‌మెంట్ కూల్చిన తర్వాత ఆ పరిసరాల్లో రాకపోకలను సాయంత్రం 4 గంటల వరకు నిషేధం విధించారు. సామాన్య ప్రజలు ఎవరూ ఆ ప్రాంతంలో కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆపరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు తమ ఇళ్లల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు అన్ని కిటీకీలను, తలపులను మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక కూల్చే సమయంలో వారందరినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ఇక అపార్ట్‌మెంట్లలోని ప్రజలు ఖాళీ చేసిన తర్వాత , అధికారులు ఆ ఫ్లాట్స్‌కు సంబంధించిన కిటికీలు తలపులను వేరు చేశారు.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?

కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా మరదు ఫ్లాట్స్ నిర్మాణం జరిగిందని చెప్పిన సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్‌లో ఈ అపార్ట్‌మెంట్స్‌ను కూల్చి వేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు 138 రోజుల సమయం ఇచ్చింది. ఇక ఈ ఫ్లాట్స్‌లో నివాసం ఉన్న వారికి కేరళ ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో పేర్కొంది.

English summary
Two Maradu flats were demolished today complying with the orders of the Supreme Court which held the structures to be illegal as they had been built in violation of the Coastal Regulation Zone norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X