వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ గారు మేం విడిపోతం: మాదేశం పేరు ద్రవిడనాడు, మేం అంటే అంత చులకనా ?

కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో భారతదేశం రెండు ముక్కలు అవుతోందని, కొత్తగా ద్రవిడనాడు అనే దేశం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై/కొచ్చి: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పశువధపై సంచలన నిర్ణయం తీసుకోవడంతో తమిళనాడుతో సహ కేరళ ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక బీజేపీకి నూకలు చెల్లాయంటూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన చెయ్యడానికి సిద్దం అయ్యారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్షిణ భారతీయులను చులకనగా చూస్తోందని తమిళనాడు, కేరళ ప్రజలు ఆరోపిస్తున్నారు. దేశంలో 50% ఆదాయం దక్షిణ భారతదేశం నుంచి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ది విషయంలో మాత్రం కేవలం ఉత్తర భారతదేశానికి ప్రధాన్యత ఇస్తోందని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

మేము విడిపోతాం ?

కేంద్ర ప్రభుత్వం మొండివైఖరితో భారతదేశం రెండు ముక్కలు అయ్యే అవకాశం ఉందని తమిళనాడు, కేరళకు చెందిన యువకులు సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతీయులను చులకనగా చూస్తే అదే జరుగుతోందని హెచ్చరిస్తున్నారు.

మాకు ప్రత్యేక దేశం కావాలి !

భారతదేశాన్ని రెండు ముక్కలుగా చెయ్యాలనే డిమాండ్ సోషల్ మీడియాలో తెరమీదకు వచ్చింది. కేంద్రం ఇలాగే ప్రజలకు ఇష్టంలేని నిర్ణయాలు తీసుకుంటే కచ్చితంగా అదే జరుగుతోందని, అందుకు పోరడటానికి యువత సిద్దంగా ఉందని సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.

తెర మీదకు ద్రవిడనాడు దేశం !

భారతదేశం రెండు ముక్కలు అవుతోందని, కొత్తగా ద్రవిడనాడు అనే దేశం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ద్రవిడనాడుకు మద్దతుగా తమిళనాడు, కేరళ ప్రజల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ద్రవిడనాడు విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

టీ ఇండియా కాదు, ద్రవిడనాడు క్రికెట్ టీం !

ద్రవిడనాడు ఏర్పడితే క్రికెట్ టీం సభ్యులు ఎవరనే విషయం సోషల్ మీడియాలో నిర్ణయించేశారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ప్రముఖ క్రికెటర్ల పేర్లను ప్రస్థావిస్తూ ద్రవిడినాడు క్రికెట్ టీం సభ్యులు వీరే అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తెరమీదకు శశిథరూర్, మంచిది కాదు !

భారతదేశాన్ని ముక్కలు చెయ్యాలన్న తమిళనాడు, కేరళ ప్రజల అభిప్రాయం మంచిదికాదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ట్వీట్ చేశారు. శశిథరూర్ ట్వీట్ పై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. పార్టీలు ఎవైనా మీరంతా ఒక్కటే, స్వార్థం కోసం మీ పనులు మీరు చేసుకుని వెలుతుంటారు, ప్రజల అభిప్రాయాలు పట్టిచుకోరు అంటూ సోషల్ మీడియాలో ఆయన్ను విమర్శించారు.

నగ్మా సైతం హితబోధ చేశారు !

భారతదేశాన్ని ముక్కలు చెయ్యడం మంచిది కాదని, ద్రవిడనాడు ఏర్పాటు సరికాదని, ద్రవిడనాడును తాను వ్యతిరేకిస్తున్నానని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా ట్వీట్ చేశారు. అమ్మా తల్లి, మీపని మీరు చేసుకోండి, దక్షిణ భారతదేశ సంసృతి, సాంప్రధాయాల గురించి మీకు ఏం తెలుసు ? అంటూ సోషల్ మీడియాలో సూటిగా ప్రశ్నించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి అంతంత మాత్రమే !

ద్రవిడనాడు ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్ కు వేదిక అయిన సోషల్ మీడియాలో తమిళనాడు, కేరళ ప్రజల నుంచి ఊహించని మద్దతు వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాలు, బీజేపీ హవా ఉన్న కర్ణాటక నుంచి మాత్రం అంతంత మాత్రంగానే మద్దతు వస్తోందని యువత ట్వీట్ చేస్తున్నారు.

స్టాలిన్ మద్దతు, మే 31వ తేదీ !

పశువధపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వంపై డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మే 31వ తేదీన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని ఎంకే. స్టాలిన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

జై ద్రవిడనాడు అంటూ పోస్టులు

ద్రవిడనాడు ఏర్పాటు చేసి ఉత్దర భారతదేశంలోని రాజకీయ నాయకులకు తగిన బుద్ది చెప్పాలని సోషల్ మీడియా వేధికగా యువత నినాదాం చేస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు అందరూ ఏకం అయిన రోజు కేంద్రంలోని పెద్దలు దిగి వస్తారని, అందు కోసం మనం అందరూ ఏకం కావాలని వేలాది మంది యువకులు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు.

English summary
After the Centre's beef ban now South Indian netizens create #dravidanadu hastag in twitter. All India Mahila Congress general secretary Nagma has opposed Draivdanadu slogan. Congress MP Shashi tharoor tweets that even if it is true, i explore my southerners not to explore anti national ideas like promoting dravida nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X