వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు శుభవార్త: ''ఇన్పోసిస్‌లో అంతా బాగుంది''

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: ఇన్పోసిస్‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయని ఆ కంపెనీ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పారు.కొన్ని రోజుల క్రితం ఇన్పోసిస్‌లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కంపెనీ ఛైర్మెన్‌గా నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దారని నారాయణమూర్తి అభిప్రాయపడ్దారు.

ఇన్పోసిస్‌లో కొంత కాలం క్రితం సిఈఓతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న వారంతా రాజీనామాలు చేసి బయటకు వెళ్ళారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి. అయితే కంపెనీ ఛైర్మెన్‌గా నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయని నివేదికలు తెలుపుతున్నాయి.

ఇన్పోసిస్‌లో పరిస్థితులకు నారాయణమూర్తే కారణమని ఆ సమయంలో కొందరు విమర్శలు కూడ గుప్పించారు. నారాయణమూర్తి కూడ ఆ సమయంలో కంపెనీలో చోటుచేసుకొన్న పరిమాణాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇన్పోసిస్‌లో ఆల్ ఈజ్ వెల్

ఇన్పోసిస్‌లో ఆల్ ఈజ్ వెల్

కొన్ని రోజుల క్రితం వరకు ఇన్పోసిస్‌లో చోటు చేసుకొన్న సంక్షోభ పరిస్థితులన్నీ చక్కబడుతున్నాయని ఆ సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చెప్పారు.
ఈ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంలో నెలకొన్న అన్ని సమస్యలను సరళీకృతం చేసే నైపుణ్యాలను తమ కంపెనీ చైర్మన్‌ నందన్‌ నిలేకని కలిగి ఉన్నారని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.

అంతా బాగుంది

అంతా బాగుంది

నిజంగా అంతా బాగుంది. ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశంలో తాను చెప్పిన మాటలు గుర్తుండే ఉంటాయి. నందన్‌ చైర్మన్‌గా ఉన్నారు. ఇక మనం నిక్షేపంగా నిద్రపోవచ్చు అని బెంగళూరులో జరిగిన 2017-18 ఇన్ఫోసిస్‌ బహుమతుల ప్రధాన కార్యక్రమంలో నారాయణమూర్తి వ్యాఖ్యానించారు.

క్లిష్టమైన సమస్య కూడ నీలేకని ఇలా..

క్లిష్టమైన సమస్య కూడ నీలేకని ఇలా..

నందన్ నీలేకని చాలా మంచిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తి అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. క్లిష్టతరమైన సమస్యలను సరళీకృతం చేసే సామర్థ్యం నీలేకనికి ఉందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇన్ఫోసిస్‌ నందన్ నీలేకని చేతుల్లోకి వెళ్లినప్పుడు చాలా క్లిష్టతరమైన సమస్యలున్న విషయాన్ని నారాయణమూర్తి గుర్తు చేశారు.

అన్నీసర్దుకొన్నాయి

అన్నీసర్దుకొన్నాయి

ఇన్పోసిస్ సంక్షోభంలో ఉన్న సమయంలో నందన్ నీలేకని బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ సమయంలో
అంతా ఆయనకు వదిలేయండి. అన్ని సర్దుకుంటాయని అన్నారు. నిలేకని తన ఉద్యోగాన్ని చాలా మంచిగా నిర్వర్తిస్తున్నారని తెలిపారు. విశాల్ సిక్కా ఇన్పోసిస్ సిఈఓగా పనిచేసిన సమయంలో ఆయన పనితీరుపై నారాయణమూర్తి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. నిలేకనికి ఎవరూ సూచనలు ఇవ్వాల్సినవసరం లేదని, ఎందుకంటే ఆయన కూడా మంచి సీఈవో అని మూర్తి అభివర్ణించారు. తనకు తాను మంచి సీఈవో అవడం వల్ల, ఈ పోస్టుకు ఎవరు సరిపోతారో నిలేకనికి తెలుసునని చెప్పారు నారాయణమూర్తి.

English summary
Infosys founder N R Narayana Murthy today said all is well in the company and its Chairman Nandan Nilekani has the skills of simplifying "lots" of complexities in the software major. "Absolutely, all is well. Remember, in my speech with the investors, I said now that we have Nandan as the chairman, we can all sleep well," he told reporters after the announcement of winners of Infosys Prize for 2017-18 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X