వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్షన్ ఎఫెక్ట్ : విమానాలు, చాపర్లు హౌస్‌ఫుల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఎలక్షన్ ఎఫెక్ట్... విమానాలు, చాపర్లు హౌస్‌ఫుల్...!! | Oneindia Telugu

ముంబై : ఓట్ల పండుగొచ్చింది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు క్యూ కడుతుంటారు. తాము మాత్రమే ప్రచారం చేస్తే సరిపోదని భావించి .. అగ్రనేతను, సినీతారలతో క్యాంపెయిన్ చేయిస్తుంటారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించేందుకు విమానాలో, హెలికాప్టర్ల కావాలి. లేదంటే ఎక్కువ చోట్ల ప్రచారం చేయడం వీలుకాదు. ఈ క్రమంలోనే విమానాలు, చాపర్లను ఇప్పటికే బుక్ చేయడంతో .. వాటి కొరత ఏర్పడుతోంది.

రాహుల్ పై మండిపడ్డ అమిత్ షా, ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నావంటూ ఫైర్రాహుల్ పై మండిపడ్డ అమిత్ షా, ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నావంటూ ఫైర్

చాపర్లు తప్పనిసరి ?

చాపర్లు తప్పనిసరి ?

సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ నేతల కోసం కొన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలు హెలికాప్టర్లు, చాపర్లను అద్దెకిస్తుంటుంది. మరుమూల ప్రాంతాలకు చాపర్ల ద్వారా త్వరగా వెళ్లేందుకు తేలికగా ఉంటుంది. చిన్న విమానాల ల్యాండింగ్ కోసం కూడా సాధారణ విమానాశ్రయం కాకుండా .. ఓ మాదిరి ల్యాండ్ చేసేలా ఉండాలి. చిన్న చాపర్ అయితే సాధారణంగా 140 నామికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ .. 2 నుంచి 3 వేల ఎత్తులో పయనిస్తోంది.

ఇవీ చాపర్ రకాలు ..

ఇవీ చాపర్ రకాలు ..

ఎన్నికల సీజన్‌లో చిన్న రెక్కలు ఉండే విమానాలు, సింగిల్ ఇంజిన్ కలిగిన విమానాలు, ఉదాహరణకు సెస్నా లాంటి విమానాలను అనుమతించడం లేదని ముంబైకి చెందిన ఏవియేషన్ నిపుణుగు ప్రదీప్ తాంపీ పేర్కొన్నారు. రెండు, అంతకన్నా ఎక్కువ గల ఇంజిన్, టర్బో కలిగిన చాపర్లకు డిమాండ్ ఎక్కువ ఉందని ఆయన పేర్కొన్నారు. కింగ్ ఎయిర్ సీ90 విమానంలో పైలట్ సహా ఐదుగురు కూర్చొవచ్చని, ఎయిర్ బీ200 విమానంలో ఇద్దరు ఫైలట్లు సమా 8 మంది ప్రయాణించొచ్చని .. ఈ రెండు హెలికాప్టర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ చాపర్లు దేశంలో 24 ఉండేవని .. వాటిని బుక్ చేయడంతో అందుబాటులో లేవని పేర్కొన్నారు. చిన్న విమానాలు, చాపర్లకు సంబంధించి మే మూడోవారానికి కూడా బుకింగ్స్ ఉన్నాయని తెలిపారు. యూరోకాప్టర్, రాబిన్‌సన్, బెల్, సికొర్‌స్కీ .. చార్లు పైలట్‌తో 11 మంది ప్రయాణించేందకు వీలుంటుందని .. కానీ ఇవి అందుబాటులో లేవని పేర్కొన్నారు. అవి మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఖచ్చితంగా చెప్పలేమన్నారు.

చాపర్ల వినియోగంలో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది.

చాపర్ల వినియోగంలో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంది.

50 శాతం చాపర్లను ఆ పార్టీ నేతలే బుక్ చేశారు. 60 రోజుల వరకు రోజుకు 3 గంటల చొప్పున చాపర్లను బుక్ చేసినట్టు ఆయా వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఒక్కో చాపర్ గంటకు రూ. 75 వేల నుంచి 3.5 లక్షల వరకు చార్జీ చేస్తోంది.

ఈసీ నిబంధనలు

ఈసీ నిబంధనలు

ఎన్నికల వేళ ప్రధాని, మంత్రులు ప్రభుత్వ చాపర్లు, విమానాలు ఉపయోగించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ప్రధాని కూడా ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ హెలికాప్టర్ వాడొద్దని, ప్రైవేట్ హెలికాప్టర్లు అద్దెకు తీసుకోవాలని పేర్కొన్నది.

 షా, రాహుల్ నో

షా, రాహుల్ నో

హెలికాప్టర్లు, చాపర్లలో నాయకులు, తారలే ట్రావెల్ చేస్తారని పేర్కొన్నారు. వీటిలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మిగతా ముఖ్యనేతలు ప్రయాణించరని తెలిపారు. సాధారణంగా వారు ఎయిర్ పోర్టు సమీపంలో మాత్రమే ఉపయోగిస్తారని పేర్కొన్నారు. భద్రతా కారణాల వల్లే రాహుల్, అమిత్ షా చాపర్ల వినియోగించరని పేర్కొన్నారు.

English summary
With canvassing for the 2019 general elections in full swing, it's a "houseful" notice outside most companies hiring out small fixed wing aircraft and helicopters for campaign purposes, aviation industry players said. Mumbai-based aviation expert Pradeep Thampy said that among the small fixed wing aircraft, single-engined aircraft like Cessna are not permitted for poll-related purposes due to various reasons.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X