వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్యులరిస్ట్‌లు హిందుత్వాన్నే టార్గెట్ చేస్తారేం: తస్లీమా

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: లౌకికవాదులుగా చెప్పుకునే వారు కేవలం హిందుత్వాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీని శనివారం నాడు ప్రశ్నించారు. భారత దేశంలో ఎలాంటి అసహనం లేదని ఆమె పునరుద్ఘాటించారు.

ఆమె కేరళలోని కోజికోడ్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివెల్‌లో మాట్లాడారు. భారత దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇతర మతాలను గౌరవిస్తారని, సహనంతో ఉండారని, భారత దేశంలోని చట్టాలు అసహనంను సహించవని చెప్పారు. అయితే, దేశంలో అసహనం కలిగిన వారు చాలామంది ఉన్నారన్నారు.

All religions are anti-woman: Taslima Nasrin

అదే సమయంలో ఆమె మాట్లాడుతూ... లౌకికవాదులుగా చెప్పుకునే వారు కేవలం హిందూ మతవాదులను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారని ప్రశ్నించారు. వారు ఇస్లామిక్ మతవాదులను లక్ష్యంగా చేసుకోరని, ఇది సూడో సెక్యులరిజమని ఎద్దేవా చేశారు.

ఆమె ఇంకా మాట్లాడుతూ... ఏ ఒక్క మతం కూడా మహిళకు అనుకూలంగా లేదని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని మతాలు కూడా మహిళా వ్యతిరేకంగానే ముందుకు సాగుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. తస్లీమా నస్రీన్‌కు భార దేశం ఆశ్రయం ఇచ్చింది.

English summary
Taslima Nasrin does not think India is an intolerant country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X