బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అంబాని కొడుకు పెళ్లితో ఢీ: 40 ఎకరాల్లో కర్ణాటక మంత్రి కుమార్తె పెళ్లి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబై/ బళ్లారి: పేదలు వారి స్థోమతను బట్టి సాంప్రధాయబద్దంగా వివాహాలు చేస్తారు. అయితే శ్రీమంతులు ఆడంబరాల కోసం వారి కుటుంబ సభ్యుల వివాహాలు చేస్తుంటారనే సామెత ఉంది. భారతదేశంలోని ప్రముఖ కుబేరుడు ముఖేష్ అంబాని కుమారుడి పెళ్లి ఘనంగా జరగడంలో భాగస్వాములు అయిన కొందరు ప్రముఖ కళాకారులతో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె వివాహం జరపడానికి అన్నీ సిద్దం చేస్తున్నారు.

గతంలో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సైతం ఆయన కుమార్తె వివాహం అంగరంగ వైభంగా జరిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు అదే గాలి జనార్దన్ రెడ్డి ప్రాణస్నేహితుడు, మంత్రి శ్రీరాములు సైతం ఆయన కుమార్తె పెళ్లి అదిరిపోయే లెవల్లో చెయ్యడానికి సర్వం సిద్దం చేశారు. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సలహాలు, సూచనలతో మంత్రి శ్రీరాములు ఆయన కుమార్తె వివాహం అదిరిపోచే లెవల్లో చేస్తున్నారు.

రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్రూ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత ఫ్యామిలీలో 6 మంది హత్య: జైల్లో లేడీ కిల్లర్ ఆత్మహత్యాయత్నం, థ్రిల్లర్

లక్ష పెళ్లి పత్రికలు

లక్ష పెళ్లి పత్రికలు

కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ఆయన కుమార్తె రక్షిత వివాహం ఘనంగా చేస్తున్నారు. న్యూఢిల్లీలో మంత్రి శ్రీరాములు ఆయన కుమార్తె వివాహ పత్రికలు డిజైన్ చేయించి లక్షకు పైగా లగ్నపత్రికలు ముద్రించారని సమాచారం. పెళ్లి పత్రికల్లో పసుపు, కుంకుమతో పాటు కేసరి, ఏలక్కీలు ఉన్నాయి. శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహా ఆహ్వాన పత్రికలు చూడటానికి చాలా అందంగా, ఆకర్షనీయంగా, కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి.

ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు!

ప్రధాని మోదీ, అమిత్ షా, సీఎంలు!

తన కుమార్తె రక్షిత వివాహానికి హాజరుకావాలని మంత్రి శ్రీరాములు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు అనేక రాజకీయ ప్రముఖులను, కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. కర్ణాటకలోని అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తన కుమార్తె పెళ్లికి శ్రీరాములు ఆహ్వానించారు. మంత్రి శ్రీరాములకు అనేక మంది సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులు, కర్ణాటకలోని 30 జిల్లాల అధికారులను మంత్రి శ్రీరాములు ఆయన కుమార్తె పెళ్లికి ఆహ్వానించారు.

9 రోజులు పెళ్లి వేడుకలు

9 రోజులు పెళ్లి వేడుకలు

ఫిబ్రవరి 27వ తేదీ గురువారం మంత్రి శ్రీరాములు ఆయన కుమార్తె రక్షిత వివాహ వేడుకలను సాంప్రధాయ బద్దంగా మొదలుపెట్టారు. 9 రోజుల పాటు మంత్రి శ్రీరాములు కుమార్తె వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ బళ్లారిలో సాంప్రధాయ బద్దంగా చప్రంతో పెళ్లి పనులు మొదలైనాయి. 29వ తేదీ ఇంటి ఇలవేల్పు పూజలు, మార్చి 1వ తేది మెహంది, మార్చి 2వ తేదీన పెళ్లి కుమార్తె బళ్లారి దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

పెళ్లి కుమార్తె ఫ్రెండ్స్ కోసం ఫైవ్ స్టార్ హోటల్

పెళ్లి కుమార్తె ఫ్రెండ్స్ కోసం ఫైవ్ స్టార్ హోటల్

పెళ్లి కుమార్తె స్నేహితులతో కలసి మార్చి 4వ తేదీన మెహంది కార్యక్రమం నిర్వహించడానికి బెంగళూరు నగరంలోని రేస్ కోర్స్ రోడ్డులోని తాజ్ వెస్ట్ ఎండ్ ఫైవ్ సార్ట్ హోటల్ లో సర్వం సిద్దం చేశారు. మార్చి 4వ తేదీ వివాహ వేడుకలకు బెంగళూరు వస్తున్న బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం అనేక పంచతార హోటల్స్ లో గదులు బుక్ చేశారు. బెంగళూరు నగరానికి వస్తున్న బంధువులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్నేహితుల కోసం మంత్రి శ్రీరాములు అనేక రిసార్ట్ లు,హోటల్స్ ఇప్పటికే బుక్ చేశారు.

కల్యాణ మండపం సెట్టింగ్ కోసం 500 మంది!

కల్యాణ మండపం సెట్టింగ్ కోసం 500 మంది!

శ్రీరాములు తన కుమార్తె వివాహం ఘనంగా చెయ్యడానికి గత మూడు నెలల నుంచి శ్రమిస్తున్నారు. మార్చి 5వ తేదీ ఉదయం 7 నుంచి 9 గంటల మద్య కాలంలో శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహ ముహూర్తం జరగనుంది. కల్యాణపండపం సెట్ వెయ్యడానికి గత మూడు నెలల నుంచి అనేక దేవాలయాలను పరిశీలించారు. బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన మేలుకోటే దేవాలయంలోని కల్యాణిని పోలిన సెట్టింగ్, హంపిలోని శ్రీవిరుపాక్ష దేవాలయం సెట్టింగ్ వేశారు. 300 మంది కళాకారులు కల్యాణ మండపం సెట్టింగ్ వెయ్యడానికి, 200 మంది నిపుణులు దేశ, విదేశాలకు చెందిన బెంగళూరు ప్యాలెస్ మైదానంలో పూలు అలంకరించడానికి పని చేస్తున్నారు.

40 ఎకరాల్లో పెళ్లి వేడుకలు

40 ఎకరాల్లో పెళ్లి వేడుకలు

బెంగళూరు ప్యాలెస్ ఆవరణంలోని 40 ఎకరాల స్థలంలో కర్ణాటక మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 27 ఎకరాల్లో పెళ్లి వేడుకల కోసం ప్రత్యేక సెట్టింగ్ లు వేశారు. 4 ఎకరాల్లో కల్యాణ మండపం సెట్టింగ్ లు వేశారు. మూడు ఎకరాల్లో పెళ్లి రిసెప్షన్ వేడుకుల నిర్వహించడానికి అదరిపోయే సెట్టింగ్ లు వేశారు. 6 ఎకరాల్లో పెళ్లికి విచ్చేస్తున్న ప్రముఖులు భోజనాలు చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. 15 ఎకరాలు పెళ్లికి వస్తున్న వారి వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. ముంబై నుంచి వచ్చిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్లు, కర్ణాటకకు చెందిన ఆర్ట్ డైరెక్టర్లు శ్రీరాములు కుమార్తె పెళ్లి వేడుకలకు సినిమా లెవల్లో అదిరిపోయే అద్బుతమైన కళ్లు చెదిరే సెట్టింగ్ లు వేశారు.

అంబాని కొడుకు పెళ్లిలోని టీం

అంబాని కొడుకు పెళ్లిలోని టీం

భారతదేశంలోని ప్రముఖ కుబేరుడు అంబాని కుమారుడి వివాహా శుభకార్యం ఘనంగా జరగడానికి పని చేసిన ప్రముఖులు మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి కోసం పని చేస్తున్నారు. అంబాని కుమారుడి వివాహ శుభకార్యానికి వీడియోగ్రఫీ తీసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ జయరామ్ పిళ్లై మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పెళ్లికి పెళ్లి దస్తులు డిజైన్ చేసిన ప్రముఖ డిజైనర్ సానియా సర్దారియా మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షితకు పెళ్లి దస్తులు తయారు చేశారు. అదే విదంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పెళ్లికి మేకప్ చేసిన టీం మొత్తం మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షితను పెళ్లికి అలంకరిస్తున్నారు. 7, 000 మంది ఒకే సారి కుర్చుని భోజనం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

భారతదేశంలో ప్రాచూర్యం పొందిన వివిద రకాల వంటకాలతో పాటు ఉత్తర కర్ణాటక వంటకాలు పెళ్లిలో వడ్డించనున్నారు. ప్రత్యేకమైన వంటలు చెయ్యడానికి సుమారు 500 మంది వంట మనుషులు పనిచేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి శ్రీరాములు తన కుమార్తె వివాహం చెయ్యడానికి అంబాని కొడుకు పెళ్లితో పోటీ పడుతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

English summary
All arrangements have been made in Bangaluru for the 9-day wedding of Shriramulu daughter of Health Minister. The preparations for a lavish wedding were held under the aegis of former minister Gali Janardhana Reddy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X