వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీరవ్ మోదీని రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం : విదేశాంగ శాఖ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Extradition Request Of Nirav Modi Is Under UK Govt’s Consideration MEA | Oneindia Telugu

న్యూఢిల్లీ : లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీ ఫోటోలు వైరలవడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ సహా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడంతో .. రియాక్టైంది. లండన్ లో ఉన్న నీరవ్ మోదీని భారత్ రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. నీరవ్ అప్పగింతకు సంబంధించిన అంశాలు లండన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నది.

All steps being taken for Nirav Modis extradition: MEA

అన్ని చర్యలు తీసుకున్నాం ...
బ్యాంకుల నుంచి రుణం తీసుకొని .. చెల్లించక విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీని భారత్ తిరిగి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్. భారత ప్రభుత్వ వినతి లండన్ ప్రభుత్వం పరిశీలిస్తోందని మీడియాకు వెల్లడించారు. లండన్ లో ఖరీదైన భవంతిలో ఉంటూ .. కొత్తగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారని టెలీగ్రాఫ్ పత్రిక ఫోటో, వీడియోలు ప్రచురించింది. దీంతో విపక్షాలు దాడి చేయడంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్నీరవ్ మోదీని ఎవరు కాపాడుతున్నారు ? లండన్ వీధుల్లో తిరుగుతుంటే పట్టుకోరా ? కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

సెప్టెంబర్ నుంచి కదలని ఫైలు

విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ నుంచి కోరుతోంది. అయినా ఇప్పటికీ చర్యలు ప్రారంభం కాలేదు. కానీ నీరవ్ మోదీ మాత్రం ఏంచక్కా వేషం మార్చి .. విలాసవంతమైన భవనంలో .. ఖరీదైన జీవితం గడుపుతున్నాడు.

English summary
the Ministry of External Affairs (MEA) on Saturday said that the government is aware of fugitive diamantaire Nirav Modi's presence in London and is taking all the necessary steps for his extradition. The MEA also said that Nirav Modi's extradition request is under the United Kingdom government's consideration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X