వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పథకం: డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం పేరు డిజిటల్ ఇండియా. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఈ ‘డిజిటల్ ఇండియా' ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారు.

ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని రెండు గ్రామ పంచాయతీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ఆర్ఐఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రే‌మ్‌జీ తదితరులు హాజరవనున్నారు.

All you need to know about Digital India programme: Explained

ఇందులో భాగంగా సీ-డాక్ రూపొందించిన ఈ-హస్తాక్షర్ సేవలను ప్రధాని మోడీ ఢిల్లీలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారు. ఐటీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ-సర్వీస్, ఈ- ప్రొడక్ట్స్, సాఫ్ట్‌వేర్ స్కీంలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు జాతీయ, రాష్ట్ర, మండల, గ్రామ, పాఠశాలల స్థాయిలో డిజిటల్ ఇండియా వీక్‌ను ప్రభుత్వం రూపొందించింది.

డిజిటల్ ఇండియా అంటే ఏమిటి?

* డిజిటల్ ఇండియాలో భాగంగా భారత్ ఓ బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందాలన్నది ప్రధాని మోడీ లక్షం.

* డిజిటల్ లాకర్, ఈ-విద్య, ఈ-వైద్యం, వాణిజ్యం, పరిపాలన వంటి తదితర సేవలన్నీ ఇకపై ఆన్‌లైన్లో అందించేందుకు చర్యలు

* మొత్తం లక్షా 13 వేల కోట్ల పెట్టుబడులతో రెండున్నర లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యం.

* అవినీతి తగ్గింపు, సాంకేతిక ఫలాలను అందిపుచ్చుకొని భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు డిజిటల్ ఇండియా ప్రాజెక్టు ఉపయోగం

* ఈ ప్రాజెక్టు ద్వారా అన్ని గ్రామ పంచాయితీలకు బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ సేవలు, ఈ-పరిపాలన వంటివి అందిస్తారు.

డిజిటల్ ఇండియా యాప్స్

డిజిటల్ ఇండియా పోర్టల్, మైగవర్నమెంట్ మొబైల్ యాప్, స్వచ్ఛ భారత్ మిషన్ యాప్, ఆధార్ మొబైల్ అప్‌డేట్ యాప్

డిజిటల్ ఇండియా ప్రాముఖ్యం

* ప్రతి పౌరుడికి అవసరంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
* గుడ్ గవర్నెన్స్ & సేవలు
* సిటిజన్స్‌కు డిజిటల్ సాధికారత

డిజిటల్ ఇండియాకు పిల్లర్స్

* బ్రాడ్‌బ్యాండ్ రహదారులు
* ఫోన్లకు యూనివర్సల్ యాక్సెస్
* పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ కార్యక్రమం
* ఇ-పాలన - టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం సంస్కరణలు
* ఇ-క్రాంతి - సేవల ఎలక్ట్రానిక్ డెలివరీ
* అన్నింటి సమాచారం కోసం
* ఎలక్ట్రానిక్స్ తయారీ - టార్గెట్ NET ZERO దిగుమతులు
* ఐటి ఉద్యోగాలు కోసం
* ప్రారంభ పంట ప్రోగ్రాములు

బుధవారం నుంచి సుమారు వారం రోజుల పాటు బీఎస్‌ఎన్‌ఎల్ డిజిటల్ వీక్ సంబురాల్ని జరుపుకుంటుందని, దీని ద్వారా పాఠశాల విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఆధునిక ఇంటర్నెట్ పోకడలను పరిచయం చేస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ ఇండోర్ సర్కిల్ జిఎం ఎంఆర్ రావత్ వెల్లడించారు.

English summary
In an order to create participative, transparent and responsive government, Prime Minister Narendra Modi will launch the much ambitious 'Digital India' programme on Wednesday, July 1 in the national capital at 4 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X