• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బ్యాడ్ బాయ్స్ అంటే మోజు... 'సోను' జీవితంలోకి వెళ్లిన మగాళ్లంతా ఖతమయ్యారు...

|

దేశ రాజధానిలో వెలుగుచూసిన భారీ సెక్స్ రాకెట్‌లో 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడ్డ సోను పంజాబన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎన్నోసార్లు అరెస్టయి బెయిల్‌పై విడుదలైన సోను.. బయటకొచ్చిన ప్రతీసారి మరింత ఆర్గనైజ్డ్‌గా వ్యభిచార కార్యకలాపాలు సాగించేది. బడా వ్యాపారవేత్తలు,హైప్రొఫెల్ వ్యక్తులకు అమ్మాయిలను సప్లై చేసేది. వ్యక్తిగతంగా 'బ్యాడ్ బాయ్స్' అంటే సోనుకు మోహం ఎక్కువని.. ఆమె జీవితంలోకి వెళ్లిన మగాళ్లంతా చనిపోయారని తెలిసినవాళ్లు చెబుతారు.

రెండు పెళ్లిళ్లు... ఇద్దరూ ఎన్‌కౌంటర్స్‌లో హతం...

రెండు పెళ్లిళ్లు... ఇద్దరూ ఎన్‌కౌంటర్స్‌లో హతం...

ఈస్ట్ ఢిల్లీలో జన్మించిన సోను పంజాబన్ అలియాస్ గీతా అరోరా.. మొదట్లో సౌత్ ఢిల్లీలోని సైదుల్లాజబ్ అనే పోష్ లొకాలిటీలో వ్యభిచార గృహం నిర్వహిస్తుండేది. ఇక్కడినుంచే పలు రాష్ట్రాలకు అమ్మాయిలను సప్లై చేసేది. సోను రెండు పెళ్లిళ్లు చేసుకోగా... ఆ ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్ కావడం,ఇద్దరూ ఎన్‌కౌంటర్స్‌లోనే మృతి చెందడం గమనార్హం. మొదటి భర్త 'హేమను సోను' పేరు నుంచే ఆమె 'సోను'ని తీసుకుని తన పేరు ముందు పెట్టుకుంది.

బ్యాడ్ బాయ్స్ అంటే మోజు...

బ్యాడ్ బాయ్స్ అంటే మోజు...

హేమను సోను ఎన్‌కౌంటర్ తర్వాత గ్యాంగ్‌స్టర్ విజయ్ సింగ్‌తో ప్రేమలో పడింది. 2003లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేతిలో అతను ఎన్‌కౌంటర్ అయ్యాడు. ఆపై దీపక్ అనే వ్యక్తితో సహజీవనం చేయగా... కొద్దిరోజులకు అతను కూడా అసోంలో ఎన్‌కౌంటర్ అయ్యాడు. సోను పంజాబన్‌ను గతంలో విచారించిన పోలీసుల ప్రకారం... ఆమెకు బ్యాడ్ బాయ్స్ అంటే చాలా మోహం ఉండేది. అయితే ఆమె జీవితంలోకి ప్రవేశించిన మగాళ్లంతా చనిపోవడం గమనార్హం.

సోను పంజాబన్‌ జీవితంపై రెండు సినిమాలు...

సోను పంజాబన్‌ జీవితంపై రెండు సినిమాలు...

సోను పంజాబన్ జీవితానికి సంబంధించి పంజాబీ భాషలో రెండు సినిమాలు కూడా వచ్చాయి. 2013లో వచ్చిన 'ఫక్రీ','ఫక్రీ రిటర్న్స్' సినిమాలు రెండూ ఆమె జీవిత కథ ఆధారంగా రూపొందించినవే. వ్యభిచార నేపథ్యం,జైలు జీవితం,గ్యాంగ్‌స్టర్స్‌తో సాహచర్యం కారణంగా పంజాబన్ జీవితంలో సినిమాకు తీసిపోని మలుపులు చాలానే ఉన్నాయి. గత వారం ఢిల్లీ కోర్టు తనను దోషిగా ప్రకటించాక... తీహార్ జైల్లోనే సోను ఆత్మహత్యకు కూడా యత్నించింది. అయితే జైలు అధికారులు త్వరగా ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

2007లో తొలిసారి అరెస్ట్...

2007లో తొలిసారి అరెస్ట్...

2007లో చిన్నారుల అక్రమ రవాణా కేసులో సోను పంజాబన్ మొదటిసారి అరెస్ట్ అయింది. అయితే అదే ఏడాది బెయిల్‌పై విడుదలైంది. తిరిగి 2008లో మరోసారి అదే కేసులో అరెస్టయింది. 2011లో వ్యభిచార కేసులో అరెస్టయింది. కొన్నాళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలైంది. అయితే 2014లో ఓ చిన్నారి సోను పంజాబన్ చెర నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించండం.. సరైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు పెట్టడంతో సోనుకు 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష తప్పలేదు.

  Delhi Rains: Watch Building Collapsed | Minto Bridge కిందుగా కొట్టుకొచ్చిన మృతదేహం || Oneindia
  ఎట్టకేలకు దోషిగా...

  ఎట్టకేలకు దోషిగా...

  సోను పంజాబన్, సందీప్ అనే వ్యక్తి కలిసి చిన్నారులను వ్యభిచార కూపంలోకి దింపేవారు. అలా 2013లో 13 ఏళ్ల ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి దాదాపు 12 మంది విటుల వద్దకు పంపించాడు. తమ కస్టమర్స్ అంతా హైప్రొఫెల్ వాళ్లే కావడంతో... వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేందుకు బాలికకు కొద్దిపాటి ఇంగ్లీష్ కూడా నేర్పించారు. 2014లో ఎలాగోలా ఆ బాలిక వారి చెర నుంచి బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోను పంజాబన్ అరెస్టు కాక తప్పలేదు. ఇదే కేసులో బుధవారం(జూలై 22) కోర్టు ఆమెకు 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక మహిళ అయినప్పటికీ... సోను పంజాబన్ మనిషిగా అన్ని హద్దులు దాటేసిందని పేర్కొంది.

  English summary
  Sonu Punjaban, the operator of Delhi's biggest sex racket, has been sentenced to 24 years of jail term. A local court, while sentencing Sonu Punjaban said, she "crossed all limits to be called a woman and deserves the severest punishment".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X