వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నిక: నరేంద్ర మోడీకి అలహాబాద్ హైకోర్టు నోటీసు

|
Google Oneindia TeluguNews

అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించిన ప్రధాని నరేంద్ర మోడీకి అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. నరేంద్ర మోడీ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి వికె శుక్లా ఈ నోటీసులు జారీ చేశారు.

ఈ కేసు తదుపరిఎమ్మెల్యే అజయ్ రాయ్ కాంగ్రెస్ తరఫున పోటీచేసి మూడో స్థానానికి పరిమితమైన విషయం తెలిసిందే.

Allahabad High Court issues notice to Narendra Modi on petition challenging

కాగా, ఎన్నికల కమిషన్‌కు మోడీ సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన భార్య యశోదాబెన్‌కు సంబంధించిన ఆదాయం, పాన్‌కార్డ్ వివరాలను పొందుపరచలేదని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అజయ్ రాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతేకాకుండా రూ. 70 లక్షల ఎన్నికల వ్యయ పరిమితిని మించి నరేంద్ర మోడీ ప్రచారానికి విస్తృతంగా ఖర్చుచేశారని ఆరోపించారు. టీషర్ట్‌లు, క్యాప్‌లపై మోడీ చిత్రాన్ని ముద్రించి లెక్కకుమించి పంపిణీ చేశారని, ఇది నియమనిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

English summary

 Prime Minister Narendra Modi has been issued a notice by the Allahabad High Court on a petition filed by Congress leader Ajay Rai challenging Modi's election from Varanasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X