వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీనా మజాకా .. చౌకిదార్ విమర్శను కూడా ప్రశంసలా వాడేస్తున్నారు

|
Google Oneindia TeluguNews

Recommended Video

మోదీనా....మజాకా.... చౌకిదార్ విమర్శను..ప్రశంసలా వాడేస్తున్నారు..!! | Oneindia Telugu

న్యూఢిల్లీ : ఎవరైనా రాయి విసిరితే .. వాటిని పట్టుకొని భవనం నిర్మించుకోండి. అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అలాగే ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. దీనిని అచ్చంగా ఫాలో అవుతున్నారు ప్రధాని మోదీ. విపక్షాల విమర్శలను తనకు అనుకూలంగా మలచుకుంటూ ఎన్నికల ప్రచార బరిలో దూసుకెళ్తున్నారు.

56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటు56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటు

ప్రధాన ప్రచారాస్త్రం .. మై చౌకిదార్

ఎన్నికల వేళ బీజేపీకి మరో మంచి ప్రచారాస్త్రం లభించింది. గత ఎన్నికల్లో ప్రధాన అస్త్రమైన చౌకిదార్ ఈసారి కూడా ఆ పార్టీకి మంచి మైలేజీ తీసుకొస్తోంది. దేశానికి కాపాలాదారునిగా ఉంటానన్న ప్రధాని మోదీ .. దొంగగా మారాడని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ పదే పదే విమర్శలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో మోదీ చౌకిదార్ అస్త్రాన్నే ఈ ఎన్నికల ముందు తీసుకొని, ఔను నేను కాపాలాదారుడినేనని ప్రకటించారు. చౌకిదార్ పేరుతో రూపొందించిన వీడియో సాంగ్‌ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మోదీ సహా బీజేపీ నేతలు తమ పేర్ల ముందు చౌకిదార్ అని రాసుకొని .. ప్రజల్లోకి వెళుతున్నారు.

ఆదరణ అదిరింది ..

ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు మోదీ తీసుకొచ్చిన ప్రచారాస్త్రం బీజేపీకి కలిసివస్తోంది. శనివారం వీడియో సాంగ్ రిలీజ్ చేసి .. ఆదివారం ట్విట్టర్‌లో తన పేరు ముందు చౌకిదార్ అని రాసారో లేదో ... తెగ ట్రెండ్ అవుతోంది. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతల చౌకిదార్ పేరు రెండురోజుల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. #MainBhiChowkidar, #ChowkidarPhirSe హ్యాష్ ట్యాగ్‌లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండురోజుల్లోనే మై బీ చౌకిదార్ ఈ హ్యాష్‌ట్యాగ్‌ను 15 లక్షల మంది ట్వీట్ చేశారంటే .. అది నెటిజన్లను ఎంత ఇంప్రెస్ చేసి ఉంటుందో అర్థమవుతోంది.

చౌకిదారే దొంగ ..? తిప్పికొట్టిన బీజేపీ

రాఫెల్ యుద్ధ విమానాల కేటాయింపు అంశంలో ప్రధాని మోదీ అనిల్ అంబానీకి మేలు చేశారని రాహుల్‌గాంధీ ఆరోపిస్తున్నారు. దాదాపు 30 వేల కోట్ల ప్రజాధనం స్నేహితుడికి దోచిపెడుతున్నారని పదే పదే విమర్శిస్తున్నారు. ఎన్నికల వేళ బహిరంగ సభలు, రోడ్ షోలలో కూడా ప్రస్తావిస్తూ ... ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు రాహుల్‌గాంధీ. దీనికి కౌంటర్‌గా బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. 'చౌకిదార్ చోర్ నహి, ప్యూర్ హై‘ చౌకిదార్ దొంగ కాదు, మంచోవాడు అని తిప్పికొట్టింది.

ధనవంతులకే చౌకిదార్, పేదలకు కాదు ..

మోదీ ప్రచార అస్త్రంగా వాడుతోన్న చౌకిదార్‌‌పై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంకగాంధీ తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. 'చౌకిదార్ (కాపాలదారు) ఎవరికీ కావాలి, సాధారణ రైతులకు వారితో ఏం పని .. ధనవంతులకే చౌకిదార్ కావాలి‘ అని కౌంటర్ అటాక్ చేశారు. నిన్న ప్రయాగ్‌రాజ్‌లో ప్రచారం ప్రారంభించిన సందర్భంగా చౌకిదార్ అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె ఈ మేరకు రియాక్టైయ్యారు. 'ఇది వారి అవకాశం, పేరు ముందు ఏం చేర్చాలనే అంశం వారి అభీష్టం మేరకు నిర్ణయించుకోవచ్చు. కానీ ఇటీవల తాను పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బంగాళదుంప రైతులను కలిశానని గుర్తుచేశారు. వారిలో ఓ రైతు స్పందిస్తూ డబ్బున్న వారికే కాపాలాదారు అవసరం కదా అని ప్రశ్నించారని, అంటే రైతులకు కాపాలాదారు అవసరం లేదు గదా‘ అని మోదీ ప్రచార అస్త్రం కూడా ధనవంతులకే కానీ .. పేదలకు, రైతులకు కాదని కుండబద్టలు కొట్టి మరీ చెప్పారు.

హామీల విస్మరణ .. వ్యవస్థల నిర్వీర్యం

ప్రధాని మోదీపై ప్రియాంక విమర్శల జాడివాన కొనసాగింది. ఇచ్చన హామీలు నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని విమర్శించారు. అలాగే రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 'దేశంలో ఉన్న వ్యవస్థలను తమ ఆధీనంలోకి పెట్టుకోవాలి, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే మొగ్గుచూపారు. కానీ దేశం ఈ విధంగా ముందుకెళ్లడం ఏ మాత్రం సముచితం కాదు. గత కొన్నేళ్లుగా ఇంట్లో ఉన్న నేను ... మోదీ చేస్తోన్న అరాచకాలను చూసి భరించలేకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను‘ అని అక్కడున్న ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రియాంక.

#MainBhiChowkidar @ 1.5 మిలియన్ ట్వీట్లు

సోషల్ మీడియాలో మై బీ చౌకిదార్ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. రెండురోజుల్లోనే 15 లక్షల మంది నెటిజన్లు ట్వీట్లు చేశారు. అలాగే #ChowkidarPhirSe 3 లక్షల ట్వీట్లు వచ్చినట్టు ట్విట్టర్ పేర్కొంది. అలాగే చౌకిదార్ చోర్ హై లక్షా 63 వేల మంది మాత్రమే చూశారు. దీనికి దాదాపు పదిరెట్లు మై బీ చౌకిదార్ హ్యాష్ ట్యాగ్‌కు లైక్ కొట్టారు.

మోదీ, షా మేనియా ..

మోదీ, షా మేనియా ..

ప్రధాని మోదీ చేసిన మై బీ చౌకిదార్‌ ట్వీట్‌కు 55 వేల నెటిజన్లు స్పందించి .. రీ ట్వీట్ చేశారు. మరో లక్షా యాభైవేల మంది లైక్ కొట్టారు. అలాగే బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన స్వచ్చ భారత్ అభియాన్‌ హ్యాష్‌ట్యాగ్‌కు జనాల నుంచి విపరీతంగా స్పందన వస్తోంది. షా ట్వీట్‌కు 17,355 రీ ట్విట్లు రాగా ..61,558 లైకులు వచ్చాయి.

 మూడోస్థానంలో రాహుల్

మూడోస్థానంలో రాహుల్

ప్రధాని మోదీ ట్విట్‌పై స్పందించి రాహుల్‌గాంధీ చేసిన చౌదికార్ చౌర్ హై ట్వీట్‌కు నెటిజన్ల నుంచి ఆశించన మేర స్పందన రాలేదు. రాహుల్ చేసిన చౌకిదార్ చోర్ హై ట్వీట్‌కు కేవలం 11 వేల మంది మాత్రమే రీట్విట్ చేయగా కేవలం 37 వేల లైకులు మాత్రమే వచ్చాయి.

English summary
'Chowkidar' was the top trending word in India for the last two days. Besides using hashtags #MainBhiChowkidar and #ChowkidarPhirSe on Twitter, Twitterati also added 'Chowkidar' prefix to their names. Congress president Rahul Gandhi had been repeatedly using the term 'Chowkidar Chor Hai' in most of his campaign rallies and speeches
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X