వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: నరేంద్ర మోడీని ప్రధాని చేసిన రాజకీయ చాణుక్యుడు పీకీపై రాళ్ల దాడి, వైఎస్ఆర్ సీపీకి సేవలు!

|
Google Oneindia TeluguNews

పాట్నా: 2014 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి, నరేంద్ర మోడీ ప్రధాని కావడానికి శక్తి వంచన లేకుండా పని చేసిన రాజకీయ చాణుక్యుడు ప్రకాష్ కిశోర్ (పీకే) కు చేదు అనుభవం ఎదురైయ్యింది. ప్రకాష్ కిశోర్ ప్రయాణిస్తున్న కారు మీద విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించి నిరసన వ్యక్తం చేశారు.

రెండో స్థానంలో పీకే

రెండో స్థానంలో పీకే

బీహార్ లో అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)లో నితీశ్ కుమార్ తరువాత రెండో స్థానంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ మీద విద్యార్థులు రాళ్లదాడి చెయ్యడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. బీహార్ లోని పాట్నా విశ్వవిధ్యాలయం ఎన్నికలే ఈ రాళ్ల దాడికి కారణం అయ్యింది.

 ఏబీవీపీ ఎంట్రీ

ఏబీవీపీ ఎంట్రీ

పాట్నా యూనివర్శిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. జేడీయూ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి సారి పాట్నా యూనివర్శిటి ఎన్నికల్లో బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ పోటీ చేస్తోంది.

వీసీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

వీసీతో ప్రశాంత్ కిశోర్ భేటీ

సోమవారం రాత్రి ప్రశాంత్ కిశోర్ పాట్నా విశ్వవిధ్యాలయం వైస్ చాన్స్ లర్ రాస్ బిహారి సింగ్ (ఆర్ బీ సింగ్) ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. పాట్నా విశ్వవిద్యాలయం వీసీతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు జీర్ణించుకోలేకపోయారు.

ఐదు గంటలు చర్చలు

ఐదు గంటలు చర్చలు

దాదాపు 5 గంటల పాటు ఆర్ బీ సింగ్, ప్రశాంత్ కిశోర్ చర్చలు జరిపారు. అనంతరం వీసి ఇంటి నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్ కిశోర్ కారు మీద విద్యార్థులు రాళ్ల వర్షం కురపించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు జాగ్రత్తలు తీసుకుని ప్రశాంత్ కిశోర్ కారు ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం కల్పించారు..

30 మంది అందర్

30 మంది అందర్

ఈ దాడిలో ప్రశాంత్ కిశోర్ కు ఎలాంటి గాయాలు కాకపోయినా ఆయన కారు మాత్రం దెబ్బతినింది. ప్రశాంత్ కిశోర్ కారు మీద దాడి చేసిన కేసులో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం ఎన్నికల నియమాలు అమలులో ఉన్నా వీసీతో ప్రశాంత్ కిశోర్ ఎలా భేటీ అవుతారు అని ఏబీవీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ

2014లో నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్బలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏతో పాటు నరేంద్ర మోడీ ప్రధానిగా విజయం సాధించడంలో ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించారు. రాజకీయ చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ సేవలు అందించిన విషయం తెలిసిందే.

English summary
anata Dal United (JDU) national vice president Prashant Kishor suffered injuries after alleged ABVP activists pelted stones on his car outside the Patna University on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X