వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను రెచ్చగొట్టే దోరణి: కుల్ భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాక్ కోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మరోసారి తన కుటిల నీతిని చాటుకుని భారత్‌ను రెచ్చగొట్టేలా చేసింది. గూఢచర్యానికి పాల్పడ్డాడన్న అభియోగంపై భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌‌కు పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. గూఢచర్యం నిర్వహిస్తూనే పాక్‌ను దెబ్బతీసేందుకు వ్యతిరేకమైన చర్యలకు దిగినట్లు భావించి తాము ఈ శిక్ష విధిస్తున్నామని కోర్టు పేర్కొంది.

రీసెర్చ్ అండ్ అలాలసిస్ వింగ్ (రా) ఏజెంట్ ‌అనే ఆరోపణలపై 2016 మార్చి 3న జాదవ్‌ను బలూచిస్థాన్‌లో పాక్ ఆర్మీ అరెస్టు చేసింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా గూఢచర్యం నిర్వహించినట్లు ఆయనపై ఆరోపణలు మోపింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కుల్ భూషణ్ మాట్లాడుతూ.. తాను ఇండియన్ నేవీ ఆఫీసర్‌ను అని చెప్పినట్లుగా ఉంది.

 Alleged Indian spy Kulbhushan Jadhav sentenced to death in Pakistan

అయితే, ఆయన ఒకప్పుడు నేవీ అధికారేనని, ప్రస్తుతం అతడు పదవీ విరమణ పొందాడని, భారత ప్రభుత్వంతో ప్రస్తుతం అతనికి సంబంధాలు లేవని చెప్పింది. ఇరాన్ నుంచి వచ్చిన వెంటనే కుల్ భూషణ్ ను అరెస్ట్ చేసింది పాక్. 'రా' అధికారి అంటూ అతడ్ని పేర్కొంది. పాక్‌ను దెబ్బకొట్టేందుకే అతడు కుట్రలు చేశాడని ఆరోపించింది.

కాగా, ఉగ్రవాద నేత మసూద్ అజహర్‌, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వంటి వారికి రక్షణ కల్పిస్తూ, సాక్యాలున్నప్పటికీ వారిని అప్పగించేందుకు నిరాకరిస్తూ వస్తున్న పాకిస్థాన్... ఎలాంటి సాక్ష్యాలు లేని జాదవ్‌కు మరణశిక్ష విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధారాలు లేకుండా ఎలా ఉరితీస్తారని భారత్ ప్రశ్నించింది. ఈ విషయంలో భారత్.. పాక్‌తో సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది.

English summary
Khulbhushan Jadhav who was accused by Pakistan of being spy has been sentenced to death on charges of espionage. He was arrested in Balochistan in 2016 on charges of spying on Pakistan, a charge that India had vehemently denied.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X