వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్:అగస్టా‌వెస్ట్‌లాండ్ కేసులో అప్రూవర్‌గా రాజీవ్ సక్సేనా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వాన్ని కుదిపేసిన అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాఫ్టర్‌ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన దుబాయ్ పారిశ్రామికవేత్త రాజీవ్ సక్సేనా తాను అప్రూవర్‌గా మారేందుకు పెట్టుకున్న పిటిషన్‌పై ఢిల్లీకోర్టు అంగీకారం తెలిపింది. రాజీవ్ సక్సేనా పై వచ్చిన ఆరోపణలకు రుజువుగా కొన్ని డాక్యుమెంట్లు జతచేసి కోర్టు ముందు ఈడీ ఉంచింది. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన స్పెషల్ జడ్జి అరవింద్ కుమార్ రాజీవ్ సక్సేనా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను అంగీకరించారు.

మెగా హీరోలు ఎక్క‌డ‌..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబాయికి బాస‌ట క‌లేనా..? మెగా హీరోలు ఎక్క‌డ‌..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబాయికి బాస‌ట క‌లేనా..?

ఇక అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసులో రాజీవ్ సక్సేనా ఇచ్చిన స్టేట్‌మెంట్ చాలా కీలకంగా మారనుందని ఈడీ న్యాయస్థానంకు తెలిపింది. అంతేకాదు ఈ కేసులో ఆయన చాలా కీలక సాక్షి అని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈఏడాది జనవరి 30న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రతాధికారులు రాజీవ్ సక్సేనాను దుబాయ్‌లోని తన నివాసం నుంచి అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి ఆయన్ను భారత్‌కు తరలించారు. అయితే గతవారమే తన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే తన బెయిల్ దరఖాస్తును ఈడీ వ్యతిరేకించలేదు.

Alleged middleman Rajiv Saxena turns approver in AgustaWestland case

రాజీవ్ సక్సేనా మరో న్యాయవాది గౌతం ఖైతాన్‌తో కలిసి పలువురు రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు మనీలాండరింగ్ పద్ధతిలో డబ్బలు ముట్టజెప్పినట్లు ఈడీ చెబుతోంది. 12 వీవీఐపీ హెలికాఫ్టర్లు కొనుగోలు చేసేందుకు గాను ఆ కాంట్రాక్ట్ అగస్టా వెస్ట్‌లాండ్‌కు దక్కేలా వీరు పావులు కదిపారని ఈడీ పేర్కొంది. రోమ్‌లో ఈ హెలీకాఫ్టర్ల డిజైన్, ఉత్పత్తి జరుగుతుంది.

English summary
A Delhi court on Monday allowed Dubai-based businessman and alleged middleman Rajiv Saxena to become an approver in the Rs 3,600 crore AgustaWestland VVIP chopper deal case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X