వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అకాళీదళ్ తో కుదిరిన పొత్తు: బీజేపీకి మరీ అన్ని తక్కువ స్థానాలా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల కోసం సమాయాత్తమౌత్తమౌతోంది భారతీయ జనతా పార్టీ. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు, వనరులనూ వినియోగించుకుంటోంది. పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలుపుతోంది. మరి కొన్ని చోట్ల.. ఇదివరకే ఉన్న పొత్తులను ఈ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తోంది. దీనికోసం నామమాత్రపు సీట్లను తీసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు.

తాజాగా పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది బీజేపీ. మొత్తం 13 లోక్ సభ స్థానాలు ఉన్న పంజాబ్ లో శిరోమణి అకాళీదళ్ 10 చోట్ల పోటీ చేస్తుంది. మిగిలిన మూడింటిని మిత్రపక్షం బీజేపీకి కేటాయించింది. అకాళీదళ్ తో పొత్తు ఖాయమైనట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం వెల్లడించారు. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

alliance between bjp and shiromani akali dal in punjab

2014 లోక్ సభ ఎన్నికల్లోనూ పంజాబ్ లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అప్పటి ఎన్నికల్లోనూ అకాళీదళ్ 10, బీజేపీ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలిపారు. అకాళీదళ్ నాలుగు సీట్లల్లో, బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించగలిగాయి. నిజానికి అయిదు సీట్లు కావాలని బీజేపీ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ అడిగినన్ని స్థానానలు తాము ఇవ్వలేమని సుఖ్ బీర్ సింగ్ బాదల్ విస్పష్టంగా ప్రకటించడంతో మూడింటితోనే సరిపెట్టుకుంది.

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో కేప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహాన్ని చూపుతోంది. 13 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగుతోంది.

English summary
BJP president Amit Shah Thursday announced that his party and its old ally the Akali Dal will fight the Lok Sabha poll together and contest on the same number of seats in Punjab as in the 2014 general elections. The SAD will fight on 10 and the BJP on three seats, he said. "SAD-BJP alliance with fight the 2019 Lok Sabha elections together. Their seats will remain the same as they were in 2014. SAD will contest on 10 seats and the BJP on three," Shah tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X