వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజ్ వాదీ కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన ఎన్నికల పొత్తు, బిజెపికి చెక్ పెట్టేందుకేనా?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీల మద్య ఎన్నికల పొత్తు కుదిరింది.అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేయనుంది. సమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో పోటీ చ

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఎట్టకేలకు ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీల మద్య ఎన్నికల పొత్తు కుదిరింది. రెండు పార్టీల మద్య అసెంబ్లీ సీట్ల పంపకంపై ఎట్టకేలకు అవగాహన కుదిరింది.శనివారం రాత్రి వరకుఈ రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు విషయంలో కొనసాగిన ప్రతిష్టంభన ఆదివారం ఉదయానికి ముగిసింది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడ సమాజ్ వాదీతో పొత్తుకు సిద్దమని ప్రకటించారు.అయితే సీట్ల కేటాయింపు విషయమై రెండు పార్టీల మద్య అగాధం చోటుచేసుకొంది.

కాంగ్రెస్ పార్టీ 110 సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది.కాని,తొలుత కాంగ్రెస్ పార్టీకి 85 సీట్లు ఇవ్వాలని సమాజ్ వాదీ భావించింది.కాని, చివరకు వంద సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.అయితే రెండు పార్టీలు పట్టువిడుపులు ప్రదర్శించాయి.

 సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీల మద్య పొత్తు

సమాజ్ వాదీ , కాంగ్రెస్ పార్టీల మద్య పొత్తు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈ ఎన్నికల్లో సుమారు కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదుర్చుకోవాలని సమాజ్ వాదీ పార్టీ భావించింది. కాంగ్రెస్ తో పొత్తు వల్ల రాజకీయంగా తనకు ప్రయోజనం కలుగుతోందని సమాజ్ వాదీ పార్టీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు నుండే అఖిలేష్ సంకేతాలను ఇచ్చాడు. ఈ మేరకు కాంగ్రెస్ కూడ సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రెండు పార్టీల మద్య పొత్తు కుదిరింది, సమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ పార్టీకి 105 స్థానాలను కేటాయించనుంది.

 సోనియా రంగంలోకి దిగడంతో మారిన సీన్

సోనియా రంగంలోకి దిగడంతో మారిన సీన్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె రాజకీయ శక్తులను కలుపుకుపోతున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ నుండి వచ్చిన స్నేహహస్తాన్ని ఆమె అందిపుచ్చుకోవాలని భావించారు.అయితే తమ పార్టీ కోరుతున్న సీట్లు ఇచ్చేందుకు సమాజ్ వాదీ పార్టీ ముందుకు రాకపోవడంతో పొత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో శనివారం నాడు సాయంత్రం సోనియాగాంధీ రంగంలోకి దిగారు. పొత్తు కుదుర్చుకోవాల్సిన పరిస్థితులను వివరించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడ పట్టువిడుపు ధోరణిని అవలంభించాయి.కాంగ్రెస్ 105 సీట్లలో పోటీ చేయనుంది.సమాజ్ వాదీ పార్టీ 298 సీట్లలో పోటీకి దిగనుంది.

బిజెపిని దెబ్బతీసేందుకే సమాజ్ వాదీతో కాంగ్రెస్ పొత్తు

బిజెపిని దెబ్బతీసేందుకే సమాజ్ వాదీతో కాంగ్రెస్ పొత్తు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో 403 సీట్లున్నాయి.ఈ రాష్ట్రం నుండి బిజెపి 73 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొంది.. ఇదే రాష్ట్రం నుండి రాహుల్, సోనియా గాంధీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా నిరోధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ సమాజ్ వాదీతో పొత్తు మేలని భావించింది .ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే బిజెపిని నిరోదించే అవకాశం ఉంటుందని భావించారు. ఈ మేరకు ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిస పోటీచేయనున్నాయి.

 కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఎస్ పి కి ప్రయోజనముందా

కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఎస్ పి కి ప్రయోజనముందా

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపిని నిలువరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి భావించారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని స్థానాల్లో బిజెపి విజయం సాధించింది.అయితే బిజెపి అభ్యర్థులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై విజయం సాధించారు. దాదాపుగా 80 కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ కు పట్టుంది. ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతోందని అఖిలేష్ భావించాడు. ఈ రెండు పార్టీల పొత్తు వల్ల ప్రయోజనం కలుగుతోందని భావించి పొత్తుకు సంకేతాలను పంపాడు.

 బిసిలు, ముస్లిం ఓట్లే లక్ష్యంగా ప్రణాళిక

బిసిలు, ముస్లిం ఓట్లే లక్ష్యంగా ప్రణాళిక

ఉత్తర్ ప్రదేశ్ లో ముస్లింలు సమాజ్ వాదీపార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో ముస్లింలు సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నారు.అయితే ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం వల్ల ఈ రెండు పార్టీలకు ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ముస్లింల ఓట్లు గంపగుత్తగా ఈ కూటమికి పడితే రాజకీయంగా కూటమికి కలిసివచ్చే అవకాశం ఉంది . ఉత్తర్ ప్రదేశ్ జనాభాలో సుమారు 19 శాతం ముస్లిం జనాభాఉంది.

 పొత్తు లేకపోతే బిఎస్ పి ప్రయోజనమా

పొత్తు లేకపోతే బిఎస్ పి ప్రయోజనమా

కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీలు పొత్తు కుదుర్చుకోకపోతే బిఎస్ పి ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయంతో ఉంది. ఈ ఎన్నికల్లో దళితులు, ముస్లింల లక్ష్యంగా బిఎస్ పి పోటీ చేస్తోంది.అయితే కాంగ్రెస్, ఎస్ పిల మద్య పొత్తు కుదరకపొతే బిఎస్ పి రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.దీంతో ఈ రెండు పార్టీల మద్య ఎన్నికల పొత్తు కుదుర్చుకొన్నారు.

English summary
alliance between samajwadi partyandcongress party in Uttarpradesh elections.samajwadi party alloted to congress party 105 assembly seats
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X