వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో కరోనా సెకండ్‌వేవ్‌- సునామీ తప్పదన్న ఉద్ధవ్‌- క్రాకర్స్‌ కాలిస్తే చాలన్న అజిత్ పవార్‌

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో త్వరలో కరోనా సెకెండ్‌ వేవ్‌ ప్రభావం తప్పదన్న హెచ్చరికలు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా.... అటు సంకీర్ణ ప్రభుత్వంలోనూ చిచ్చుకు కారణమవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించేందుకు ఉద్ధవ్‌ థాక్రే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ తప్పుబడుతోంది.

దీపావళి సందర్భంగా రోడ్లపైకి వచ్చిన జనం వైరస్‌ను చంపేస్తారేమో అన్నట్లు అనిపించిందంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జనం ఎక్కువగా రోడ్లపైకి రావడం మంచిదే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలున్నాయి. అయితే సీఎం ఉద్ధవ్‌ థాక్రే మాత్రం జనం రోడ్లపైకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్‌ సునామీలా విరుచుకుపడబోతోందన్న హెచ్చరికలు వస్తున్నాయి. వ్యాక్సిన్ రాగానే రాష్ట్రానికి 25 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఆ లోపు మాస్కులు, భౌతికదూరం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం తక్షణావసరమని ఉద్ధవ్‌ పేర్కొన్నారు.

Almost Like Tsunami: Uddhav Sounds Virus 2nd Wave Warning for Maha, Ajit Mocks Diwali Shoppers

Recommended Video

#Telangana : తెలంగాణలో Corona సెకండ్ వేవ్ అవకాశాలు.. రాజధాని Hyderabad లో వైరస్ ఉధృతి!

మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్రా రాత్రి పూట కర్ఫూ విధించాలని తనకు కొందరు సలహా ఇచ్చారని, కానీ ఆంక్షలతో మార్పు రాదని, ప్రజలు బాధ్యతాయుతంగా ఉంటేనే మార్పు సాధ్యమవుతుందని ఉద్దవ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఉద్ధవ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మాత్రం 8 నుంచి 10 రోజుల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు.

English summary
The crowd out on roads during Diwali perhaps thought that presence of large number of people could kill the coronavirus, said Maharashtra deputy chief minister Ajit Pawar while hitting out at those who flouting Covid-19 rules during the festive season that has led to surge in infections. He further said that the government will review the situation for the next eight to 10 days and will then take a decision on lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X