వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆళ్వార్ అత్యాచార మహిళకు పోలీస్ ఉద్యోగం...ప్రకటించిన రాజస్థాన్ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలనే భర్తముందే భార్యను అత్యాచారానికి గురిచేసిన రాజస్థాన్ అళ్వార్ బాధితురాలికి న్యాయం చేకూర్చేందుకు ఆ రాష్ట్ర్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. భాదితురాలు కోరుకుంటున్నట్టుగా ఆమేకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తానని ప్రకటించింది. ఈనేపథ్యంలోనే అందుకు సంబంధించి ప్రక్రియ కూడ ప్రారంభించారు.కాగా ఇలాంటీ అత్యచారాలకు పాల్పడ్డవారిని శిక్షించేందుకు పోలీస్ ఉద్యోగంలో చేరతానని బాధితురాలు ప్రకటన చేసింది.దీంతో ఆమే కోరుకున్నట్టుగానే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నిర్ణయం తీసుకున్నారు.

రాజస్థాన్ లోని ఆళ్వార్‌లో ఏప్రిల్ 26న టూవీలర్ పై వెళుతున్న భార్యభర్తలను అడ్డగించి ఆరుగురు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఇసుక క్వారీల్లోకి తీసుకెళ్లి, ఆమే భర్తపై దాడిచేసి 18 సంవత్సరాల మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది..ఈనేపథ్యంలోనే అత్యాచారం ఘటనపై దేశ ప్రధాని నరేంద్రమోడీ నేరుగా ప్రస్థావించారు. రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుపలుకుతున్న మాయవతిపై ఆయన విరుకుచుకు పడ్డారు. ఆమే దళితులపై ముసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. దీంతో ఆ సంఘటన రాజకీయంగా పెనుదుమారాన్ని రేపింది.

Alwar gang-rape girl gets police job

ఈనేపథ్యంలోనే అత్యాచార ఘటన బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో పాటు, మాయవతి మధ్య మాటల యుద్దానికి తెరలేపింది. కాగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో అత్యాచారానికి గురైన భాదిత మహిళను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం పరామర్శించారు. రాజస్థాన్ రాష్ట్ర్ర సీఎం అశోక్ గెహ్లాట్‌తో కలిసి రాహుల్ మాట్లాడుతూ...అత్యచార బాధితురాలికి తగిన న్యాయం జరుగుతుందని ప్రకటించారు. దీంతో ఆయన ప్రకటించిన తర్వాత రాజస్థాన్ ప్రభుత్వం బాధిత మహిళకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టింది.

English summary
Rajastan government has annonced a police constable job for alwar rape victim .rape accured on april 26 in alwar of rajastan state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X