వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ కొత్త పార్టీ: పన్నీర్ సెల్వం క్లారిటీ, చెత్త గురించి, ఎంజీఆర్, అమ్మ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం టీటీవీ దినకరన్ కొత్త పార్టీ విషయంలో స్పంధించారు. శశికళ కుటుంబ సభ్యులు కొత్త పార్టీ పెట్టుకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, చెత్త విషయాల గురించి తాము ఎక్కువగా పట్టించుకోమని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు.

పట్టించుకోము

పట్టించుకోము

టీటీవీ దినకరన్ కొత్త పార్టీ గురించి తాను అసలు పట్టించుకోలేదని, అన్నాడీఎంకే నాయకులు సైతం ఆ విషయంపై ఆసక్తి చూపించడం లేదని అన్నారు. మదురై నుంచి చెన్నై విమానాశ్రయం చేరుకున్న పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు.

Recommended Video

టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం.. శశికళ ఫ్యామిలీ కొత్త పార్టీ !
ఆర్ కే నగర్ లో !

ఆర్ కే నగర్ లో !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఎలా ఎమ్మెల్యే అయ్యారో అందరికీ తెలిసిందే అని పన్నీర్ సెల్వం గుర్తు చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించినట్లు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో శశికళ వర్గీయులు విజయం సాధించలేరని పన్నీర్ సెల్వం జోస్యం చెప్పారు.

ఎన్నిపార్టీలు వచ్చినా !

ఎన్నిపార్టీలు వచ్చినా !

తమిళనాడులో ఎన్నో పార్టీలు వచ్చి వెలుతున్నాయని, ఎంజీఆర్, జయలలిత ముందుకు తీసుకువచ్చిన అన్నాడీఎంకే పార్టీని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు.

పన్నీర్ సెల్వం దెబ్బ !

పన్నీర్ సెల్వం దెబ్బ !

పన్నీర్ సెల్వం ఒత్తిడితో అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యులను శాస్వతంగా బహిష్కరించారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత టీటీవీ దినకరన్ తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నిస్తున్నారు.

మన్నార్ గుడి మాఫియా

మన్నార్ గుడి మాఫియా


ఎంజీఆర్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తానని టీటీవీ దినకరన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆర్థికంగా బలంగా ఉన్న మన్నార్ గుడి మాఫియా ఎలాగైనా తమిళనాడులో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసి వారికి అధికారం దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నది.

English summary
Am not bothered about Dinakarans New Party Announcement. After Returning from the Madurai he spoke this in Chennai Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X