వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్పీలోకి అమర్ సింగ్ రీ-ఎంట్రీ : జయప్రద ఆశలకు మోజులు

|
Google Oneindia TeluguNews

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది అక్కడి అధికార పార్టీ సమాజ్ వాదీ. సీఎం అఖిలేష్ యాదవ్ పాలన పట్ల అక్కడి జనాల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి ఉండడంతో, పార్టీలో కొత్త చేరికల ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే.. మాజీ రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ ను తిరిగి పార్టీలోకి చేర్చుకుంది సమాజ్ వాదీ పార్టీ. అమర్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నేత బ్రేణి ప్రసాద్ వర్మ కూడా సమాజ్ వాద్ పార్టీలో చేరారు. 2010 లో సమాజ్ వాదీ పార్టీకి అమర్ సింగ్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. అమర్ సింగ్ ను పార్టీ తరుపున మళ్లీ రాజ్యసభకు పంపించే ప్రయత్నాలు జరగవచ్చని తెలుస్తోంది.

Amar Singh Rejoins Samajwadi Party, may get a Rajya Sabha Berth

అన్ని రాజకీయ పార్టీల్లోనూ అమర్ సింగ్ కు సన్నిహిత సంబంధాలు ఉండడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి లాభిస్తుంది అనే ఆలోచనలో ఉంది సమాజ్ వాదీ నాయకత్వం. ఇకపోతే, అదే అమర్ తో పాటే నేనూ అన్నట్టుగా వ్యవహరించే జయప్రద ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో చేరతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

బాలీవుడ్ లో చాలామందే అభిమానులున్న జయప్రదకు యూపీలోను ఫాలోయింగ్ ఎక్కువ. ఈ నేపథ్యంలోనే జయప్రద కూడా సమాజ్‌వాదీలో తిరిగి చేరవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. అయితే అమర్‌సింగ్, జయప్రద అంటే ఏ మాత్రం గిట్టని యూపీ మంత్రి ఆజం ఖాన్ వీరి రాకపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అమర్ సింగ్ రాకతో ఆయన పార్టీలోనే కొనసాగుతారా.. లేక పార్టీ నుంచి పక్కకు తప్పుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.

English summary
Expelled Samajwadi Party (SP) leader Amar Singh returned back to the party on Tuesday and is likely to be made a Rajya Sabha MP.Shivpal Yadav, the younger brother of SP supremo Mulayam Singh Yadav, confirmed that Amar had rejoined the party and would actively participate in the campaign for the 2017 Uttar Pradesh Assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X