వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ లో సిద్దూ ముఖ్యమంత్రి ?ఆ పోస్టర్లు ప్రత్యర్థుల పనే

పంజాబ్ ముఖ్యమంత్రిగా సిద్దూనే కాంగ్రెస్ పార్టీ నియమిస్తారనే పోస్టర్లకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పిసిసిచీఫ్ అమరీందర్ సింగ్ చెప్పారు.భేషరతుగానే సిద్దూపోలీసులుచెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజాబ్ :పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే మాజీ క్రికెటర్ సిద్దూ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం సాగుతోంది.అయితే ఈ ప్రచారాన్ని పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్ తోసిపుచ్చారు. ఈ పోస్టర్లకు తమ పార్టీకి ఎలాంటి సంబందం లేదన్నారు.

పంజాబ్ రాష్ట్రంలో ఈ దఫా అధికారంలోకి వచ్చేందుకుగాను కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను వేస్తోంది. ఈ మేరకుమాజీ క్రికెటర్ సిద్దూను తమ పార్టీలో చేర్చుకొంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాజీ క్రికెటర్ సిద్దూ ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తారనే ప్రచారం సాగింది.అయితే ఈ ప్రచారం సిద్దూ పార్టీలో చేరకముందునాటి పరిస్థితి.

అయితే పార్టీలో చేరిన తర్వాత మరో రకమైన ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే సిద్దూ ముఖ్యమంత్రి అవుతారంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.

 సిద్దూ ముఖ్యమంత్రి అవుతారా?

సిద్దూ ముఖ్యమంత్రి అవుతారా?

మాజీ క్రికెటర్ సిద్దూను కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఈ మేరకు పంజాబ్ లో వెలసిన పోస్టర్లు రాజకీయంగా సంచలనం కల్గిస్తున్నాయి. ఈ పోస్టర్లతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఎలాంటి షరతులు లేకుండానే సిద్దూ పార్టీలో చేరారని అమరీందర్ సింగ్ మీడియాకు వివరణ ఇచ్చారు.

అమరీందర్ సింగ్ కు ఇవే చివరి ఎన్నికలు

అమరీందర్ సింగ్ కు ఇవే చివరి ఎన్నికలు

మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ పిసిసి అధ్యక్షుడు అమరీందర్ సింగ్ కు ఇవే చివరి ఎన్నికలు. అమరీందర్ సింగ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావిస్తున్నారు.అయితే సిద్దూ ఆయనకు పోటీగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.సిద్దూ ముఖ్యమంత్రి అవుతారంటూ వెలసిన పోస్టర్లు కూడ అమరీందర్ సింగ్ కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

ఆ పోస్టర్లకు కాంగ్రెస్ కు సంబంధం లేదు

ఆ పోస్టర్లకు కాంగ్రెస్ కు సంబంధం లేదు

పంజాబ్ ముఖ్యమంత్రిగా సిద్దూనే కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసే అవకాశం ఉందని పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులను ఇబ్బందులకు గురిచేసేందుకే ఈ పోస్టర్లను ఏర్పాటుచేశారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆప్, బిజెపి లకు చెందిన వారు ఈ పోస్టర్లను ఏర్పాటుచేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం

కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం

కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేసేందుకుగాను పోస్టర్లను ఏర్పాటు చేశారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి భరించలేకే ప్రత్యర్థులు ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని అమరీందర్ సింగ్ వర్గీయులు ఆరోపిస్తున్నారు.

.బేషరతుగానే సిద్దూ కాంగ్రెస్ లో చేరిక

.బేషరతుగానే సిద్దూ కాంగ్రెస్ లో చేరిక

మాజీ క్రికెటర్ సిద్దూ బేషరతుగానే కాంగ్రెస్ పార్టీలో చేరారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. సిద్దూ కుటుంబానికి తనకు సన్నిహిత సంబంధాలున్నాయని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెబుతున్నారు. సిద్దూ చేరికను తొలుత అమరీందర్ సింగ్ వ్యతిరేకించారని ప్రచారం సాగింది. అయితే సిద్దూ పార్టీలో చేరిన తర్వాత తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పే ప్రయత్నం చేశాడు అమరీందర్ సింగ్.ఈ మేరకు సిద్దూ తన కొడుకు లాంటివాడని చెప్పాడు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులకే సిద్దూ ముఖ్యమంత్రి అవుతారంటూ వెలసిన పోస్టర్లతో అమరీందర్ కు కొత్త తలనొప్పులు వచ్చాయి.

English summary
punjub former chief minister amarinder singh clarification on navjot singju sidhu as cm posters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X