వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్‌నాథ్ యాత్రపై రెడ్ అలర్ట్.... యాత్రికులు త్వరగా వెళ్లిపోవాలని అధికారుల ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో అమర్ నాథ్ యాత్రికులు,టూరిస్టులు ఎక్కువ రోజులు ఉండవద్దంటూ జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. యాత్ర స్థలాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో వీలైనంత తొందరగా అమరనాథ్ యాత్రికులు దర్శనం అయిన వెంటనే తిరిగి వెళ్లిపోవాలని, నోటీసులో పేర్కోంది. మరోవైపు టూరిస్టులు కూడా వ్యాలీలో ఎక్కువ రోజులు బస చేయకూడదని జమ్మూ ప్రభుత్వం విజ్ణప్తి చేసింది.

 అమర్‌నాథ్ యాత్రపై దాడులు చేసే అవకాశం

అమర్‌నాథ్ యాత్రపై దాడులు చేసే అవకాశం

కాగా అంతకుముందే జమ్ము కశ్మీర్ డీజీపీతో పాటు, సీఆర్పీఎఫ్, లెఫ్టినెంట్ కల్నల్ మీడీయా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలోనే పాక్ ఆర్మీ సాయంతో ఉగ్ర‌వాదులు అమ‌ర్‌నాథ్ యాత్ర‌పై దాడులు చేసేందుకు కుట్రలు పన్నిందని తెలిపారు. యాత్ర వెంట ఉన్న ప్రాంతాల్లో తీవ్రవాదులు ల్యాండ్ మైన్స్ ఏర్పాటు చేసినట్టుగా భారత్ ఆర్మీ అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం యాత్రకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కార్ప్స్ ఏరియా క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ కేజీఎస్ థిల్లాన్ తెలిపారు.

అమర్‌నాథ్ యాత్రలో ల్యాండ్‌మైన్లు,

అమర్‌నాథ్ యాత్రలో ల్యాండ్‌మైన్లు,

ఆర్మీ తనిఖీల్లో శక్తివంతమైన ఐఈడీలు, నాటు బాంబులు, టెలీస్కోప్, M-24 American sniper రైఫిల్ అమ‌ర్‌నాథ్ రూట్లో దొరికిన‌ట్లు ఆర్మీ వ‌ర్గాలు వెల్లడించాయి. ఇంకా ఏమైన ల్యాండ్ మైన్లు ఉన్నాయనే అనుమానతం విస్తృతంగా గాలింపు జ‌రుగుతున్న‌ట్లు ఆర్మీ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే వాటిని స్వాధినపరుచుకున్న పోలీసులు మీడీయా ముందు ప్రదర్శించారు.

భద్రతా దళాల ఎఫెక్ట్,

భద్రతా దళాల ఎఫెక్ట్,

కాగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370,తోపాటు 35ఏను తొలగిస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. దీంతో వాటి తొలగింపుపై స్థానిక రాజకీయ పార్టీలతోపాటు కశ్మీరులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడ ముందు జాగ్రత్త చర్యగా 10వేల మంది భద్రతా దాళాలను కశ్మీర్ లోయ ప్రాంతంలోకి తరలించాయి. దీంతో తీవ్రవాదులు ప్రతికార చర్యలు తీసుకునేందుకు దాడులు చేసేందుకు సన్నమద్దవుతున్నారు. అమర్‌నాథ్ యాత్రపై దాడి కొనసాగించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ప్రభుత్వం కూడ అనే విమర్శలు ఎదుర్కోనే అవకాశాలు ఉన్నాయి.

English summary
The Jammu and Kashmir (J&K) administration on Friday issued a security advisory for the Amarnath yatra pilgrims, citing terror threat in the Kashmir Valley
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X