వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంటాడి చంపాలి: అమర్నాథ్ దాడిపై సెహ్వాగ్ సహా ప్రముఖుల ఆగ్రహం ఇలా

అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడిపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 11మంది గాయపడిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 11మంది గాయపడిన విషయం తెలిసిందే.

'నోటివెంట మాట రాలేదు! కాశ్మీరీలు సిగ్గుతో తలదించుకోవాలి' 'నోటివెంట మాట రాలేదు! కాశ్మీరీలు సిగ్గుతో తలదించుకోవాలి'

ఈ ఘటనపై పలువురు క్రీడా, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ దాడిపై స్పందిస్తూ.. 'మృతుల ఆత్మకు శాంతి చేకూరాలి. అమాయకులను చంపేశారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ' అని అన్నారు.

Amarnath Yatra terror attack: Virender Sehwag, Yogeshwar Dutt and more sportspersons condemn pilgrims killed

'అమాయకులపై దాడి చేయడం అమానుషం. ఓ పక్క కోపంగా మరో పక్క బాధగా ఉంది' అని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. 'దాడిలో మృతి చెందిన అమర్నాథ్ యాత్రికుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా' అని భారత క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

'చాలా బాధాకరం. ఎంత దారుణమైన ఘటన' అని నటి కాజల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేరుగా యుద్ధానికి రండి. అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. అమాయకులపై దాడి చేస్తే మీకెలా ఉపయోగపడుతుంది' అంటూ బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'అసలు ఇంత దారుణమైన దాడికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి కారణమైన వారిని వెతికి మరీ చంపాలి' అని మరో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా ఆగ్రమం వ్యక్తం చేశారు.

ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పి, యాత్రికులను కాపాడాల్సిన అవసరం ఉందని క్రీడాకారుడు యోగేశ్వర్ దత్ అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని క్రికెటర్లు సురేష్ రైనా, మొహమ్మద్ కైఫ్ పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాలని మరికొందరు ప్రముఖులు అన్నారు.

అమర్నాథ్ ఉగ్రదాడి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. యాత్రికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దాడి ఘటన తనను చాలా బాధకు గురిచేసిందని టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే తెలిపారు.

'మరోసారి అమాయకులు ప్రాణాలో కోల్పోయారు. ఇలాంటి దాడులను అరికట్టాల్సిందే. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అని భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపారు. కాగా, జమ్మూకాశ్మీర్ హెల్ప్ లైన్:18001807054,01932222337#అమర్నాథ్ యాత్ర నెంబర్‌ను షేర్ చేశారు మిథున్ మన్హాస్.

English summary
An unfortunate incident took place in Anantnag in Jammu and Kashmir on Monday where militants opened fire, killing seven people, who were on their way to Amarnath Yatra. The pilgrims were travelling in a bus from Balram to Mir Bazar when the incident took place. Following the incident, Indian sportsperson expressed their deep condolences to the victims and their families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X