వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు, రేపు.. అమెజాన్‌ ‘ఆపిల్‌ ఫెస్ట్‌’: డిస్కౌంట్‌, ఎక్స్చేంజ్‌ ఆఫర్స్‌, ఇంకా బోలెడు..

అమెజాన్‌ ఇండియా రెండు రోజుల ఆపిల్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది. నేడు, రేపు(సోమ, మంగళ) ఈ ఫెస్టివల్‌ జరుగనుంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెజాన్‌ ఇండియా రెండు రోజుల ఆపిల్‌ ఫెస్టివల్‌కు తెరతీసింది. ఈ ఫెస్టివల్‌లో ఐఫోన్లు, వాచ్‌లు, ఐప్యాడ్‌లు, ఐమ్యాక్‌లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అమెజాన్‌ ప్రకటించింది. నేడు, రేపు(సోమ, మంగళ) ఈ ఫెస్టివల్‌ జరుగనుంది.

ఈ ఫెస్టివల్‌లో భాగంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డుహోల్డర్స్‌కు రూ.1500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌ అందిస్తోంది. అంతేకాక ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్లు డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉన్నాయి.

Amazon Apple Fest - Rs 1500 Cashback, top deals on iPhone SE, iPhone 7 and more

ఐఫోన్‌ 7, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ డివైజ్‌ ధర రూ.56,200 కాగ, ఈ ఫోన్‌ 11,201 రూపాయల డిస్కౌంట్‌తో 44,999 రూపాయలకే అందుబాటులో ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద పాత డివైజ్‌తో ఎక్స్చేంజ్‌లో ఐఫోన్‌ 7ను కొనుగోలు చేయాలనుకుంటే 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది.

ఇక 32జీబీ స్టోరేజ్‌ కలిగిన ఐఫోన్‌ 6 ధర 29,500 రూపాయలు కాగా, ఈ డివైజ్‌ కూడా 3,501 రూపాయల డిస్కౌంట్‌లో 25,999కే అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్‌ 6పై కూడా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద 14,920 రూపాయల వరకు తగ్గింపును అమెజాన్‌ అందిస్తోంది.

ఆపిల్‌కు చెందిన మరో ఫేమస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ కూడా డిస్కౌంట్‌ ధరలో అందుబాటులో ఉంది. ఐఫోన్‌ ఎస్‌ఈ అసలు ధర 26వేల రూపాయలు కాగ, 7,001 రూపాయల డిస్కౌంట్‌లో 25,999 రూపాయలకే ఈ ఫోన్‌ను వినియోగదారులు కొనుగోలు చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కింద ఈ ఫోన్‌పై కూడా 14,920 రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది.

ఇక ఆపిల్‌ స్మార్ట్‌వాచ్‌లపై 3000 రూపాయల తగ్గింపు, ఐప్యాడ్‌లపై ఎలాంటి ఖర్చులు లేని ఈఎంఐలు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అమెజాన్‌ అందిస్తోంది. ఈ అమెజాన్ ఆపిల్ ఫెస్ట్ సోమ, మంగళవారాలు.. కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుంది.

English summary
Amazon has launched a two-day Apple Fest, which will take place today and tomorrow (August 28 and August 29) The e-commerce portal will offer deals, cashbacks on purchase of the Apple iPhones, iPads, MacBooks and Apple Watch as part of this exclusive sale. For those with American Express credit cards Amazon is offering up to Rs 1,500 in Amazon Pay Balance on any Apple product purchased on the e-commerce website. The cashback is limited to one product per card, and will credited to the account by October 29, 2017 latest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X