వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ మొదలెట్టిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్.. ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే.. ఆఫర్లు!

ఈ-కామర్స్ దిగ్గజాలు ఫిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలు మళ్లీ ఆఫర్లు మొదలెట్టేశాయి. ‘బ్యాక్ టు కాలేజ్ ల్యాప్‌టాప్స్’ పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్లు ప్రకటించాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజాలు ఫిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలు మళ్లీ ఆఫర్లు మొదలెట్టేశాయి. 'బ్యాక్ టు కాలేజ్ ల్యాప్‌టాప్స్' పేరుతో బ్రహ్మాండమైన ఆఫర్లు ప్రకటించాయి.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో ముందుకొచ్చాయి. ఇందులో భాగంగా కాలేజీ విద్యార్థుల కోసం వివిధ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లను అందుబాటులో ఉంచాయి. లెనోవో, హెచ్‌పీ, డెల్ తదితర వాటిపై అమెజాన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ప్రకటించింది.

Amazon, Flipkart Host Back to College Laptop Sales: Here Are the Top Offers

అలాగే హ్యుమానిటీస్ అండ్ కామర్స్, ఇంజినీరింగ్, మెడికల్ స్టడీస్, ఎంబీఏ, డిజైన్, ఆర్కిటెక్చర్, గేమింగ్ ల్యాప్‌టాప్‌లను అందుబాటులో ఉంచింది. అమెజాన్‌లో లెనోవో ఐడియా ప్యాడ్ 15.6 అంగుళాల ల్యాప్‌టాప్ అత్యంత చవగ్గా లభిస్తోంది. ధర కేవలం రూ.18,990. పాత ల్యాప్‌టాప్‌పై రూ.10వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది.

మరో ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా మంగళవారం నుంచి బ్యాక్ టు కాలేజ్ సేల్‌ను ప్రారంభించింది. గురువారం వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా హెచ్‌పీ ఇంప్రింట్ కోర్ ఐ3 సిక్స్త్ జనరేషన్ విండోస్ 10 హోం రన్నింగ్ ల్యాప్‌టాప్‌ను రూ.35,964కే ఆఫర్ చేస్తోంది. రూ.7వేల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ప్రకటించింది. అలాగే నో ఈఎంఐ కాస్ట్ ఆప్షన్ కూడా ఉంది.

ఐసీఐసీఐ, సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డులతో 36 నెలలకు రూ.999 ఈఎంఐతో దీనిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఏసర్, ఐబాల్, లావా ల్యాప్ టాప్ లను రూ.9,999కే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. వీటిలో కొన్నింటికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

English summary
Amazon India and Flipkart are both hosting Back to College laptop sales on their respective sites. Both the e-commerce verticals are offering different deals, exchange offers, and No Cost EMI options on laptops from varied brands for students going back to college after the long summer vacation. Amazon India has listed Intel-powered laptops from Lenovo, HP, Dell, and more with exchange offers and No Cost EMI options. The e-commerce site has also segregated laptops into curriculum sections like – Humanities and Commerce, Engineering, Medical Studies, MBA, Design and Architecture, and even Gaming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X