వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Amazon offers:అక్టోబర్ 17 నుంచి భారీ ఆఫర్లు..ప్రైమ్ మెంబర్స్‌కు 24 గంటల ముందే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : దసరా వచ్చేస్తోంది.. ఆపై దీపావళి రానుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2020 పేరుతో భారీ ఆఫర్లను తమ కస్టమర్లకు అందిస్తోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ సేల్ నెలరోజుల పాటు కొనసాగుతుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు 24 గంటలముందే అంటే అక్టోబర్ 16నే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దాదాపు 6.5 లక్షల అమ్మకపుదారులు కొన్ని వందల ఉత్పత్తులను అమెజాన్‌ వేదికగా అందిస్తున్నారు. ఇక కస్టమర్లు దాదాపుగా 4 కోట్ల ప్రాడక్ట్స్‌ను ఈ చిన్న మరియు మధ్య తరహా వ్యాపారస్తులనుంచి భారీ డిస్కౌంట్లపై కొనుగోలు చేయొచ్చు. 100 నగరాల్లోని 20వేల స్థానిక దుకాణాల నుంచి ఈ ఉత్పత్తులను ఆఫర్లపై కొనుగోలు చేసుకోవచ్చు.

ఆరు భాషల్లో అమెజాన్ షాపింగ్

ఇక కస్టమర్లు తమకు నచ్చిన భాషను ఎంచుకుని అమెజాన్‌లో షాప్ చేయొచ్చు. అంటే కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు భాషలను అమెజాన్ తన యాప్‌పై తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు మరియు కిచెన్ అప్లయెన్సెస్, ఫ్యాషన్&బ్యూటీ, గ్రాసరీలతో పాటు మరికొన్ని ఇతర కేటగిరీలో అమెజాన్ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే పోటీదారులుగానిలిచిన ఇతర ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు ధీటుగా 900 కొత్త ప్రాడక్ట్స్‌ను అమెజాన్ పరిచయం చేస్తోంది.

Amazon Great Indian Festival sale 2020:Great offers from Oct 17th,Prime Members from 16th Oct

ఆఫర్లు డీల్స్ గురించి తెలుసుకోండి:

దీపావళి వరకు కొనసాగే ఈ ఆఫర్‌లో నవరాత్రి దుర్గా పూజా, పెళ్లిళ్లకు దంతేరాస్‌లాంటి పండగలకు కావాల్సిన వస్తువులన్నీ అమెజాన్ గ్రేటి ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందిస్తోంది. కరోనా కష్టసమయాల్లో నష్టాల్లో కూరుకుపోయిన కొన్ని లక్షల మంది చిన్న మధ్య తరహా వ్యాపారస్తులకు ఊతమిచ్చేందుకు వారిని ఆదుకుని తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ సేల్‌లో భాగస్వాములను చేయడం జరిగింది. వేల సంఖ్యలో ఉన్న అమెజాన్ అమ్మకదారుల నుంచి లోకల్ షాప్స్, అమెజాన్ లాంచ్‌ప్యాడ్, అమెజాన్ సహేలీ,అమెజాన్ కరీగర్‌లాంటి కార్యక్రమాల కింద వినియోగదారులు మంచి డీల్స్ మరియు ఆఫర్లను పొందొచ్చు. అంతేకాదు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10శాతం ఇన్స్‌టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

900 టాప్‌ బ్రాండ్స్ నుంచి ఉత్పత్తులు

టాప్ బ్రాండ్స్ నుంచి దాదాపు 900 కొత్త ఉత్పత్తులు అమెజాన్‌పై అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాంసంగ్, వన్ ప్లస్, యాపిల్, బోట్, జేబీఎల్, సోనీ, సెన్‌హేసర్, డాబర్, ఎల్‌జీ ఐఎఫ్‌బీ, హిసెన్స్, టైటాన్, మ్యాక్స్ ఫ్యాషన్,బీబా, స్పైకార్, పానాసానిక్, యురేకా ఫోర్బ్స్, వాష్చర్, ల్యాక్మే, బిగ్, మసల్స్, కాస్మిక్ బైట్, మ్యాగీ, టైడ్, రియల్‌మీ, మైక్రోసాఫ్ట్, ఎక్స్‌బాక్స్, వెస్ట్‌ల్యాండ్ హార్పర్, గ్జియోమీ, ఒప్పో, సాన్యో, గోప్రో, హానర్, బాష్, అమేజ్‌ఫిట్, పీటర్ ఇంగ్లాండ్, లీవైస్, రివర్, అమెజాన్ బేసిక్స్, అర్బన్, బొటిక్, పాన్ మెక్‌మిలాన్, కార్మేట్, బైక్ బ్లేజర్‌లాంటి బ్రాండ్లతో పాటు మరికొన్ని బ్రాండ్లు ఉన్నాయి. ఇక కొన్ని కొత్త బ్రాండ్లు కూడా అమెజాన్‌పై దర్శనమిస్తున్నాయి. అందులో అమెజాన్ నుంచి అమెజాన్ ఎకో డాట్, ఎకో డాట్ విత్ క్లాక్, అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ స్టిక్, ఫైర్ టీవీ స్టిక్ లైట్ విత్ అలెక్సా వాయిస్ రిమోట్ లైట్‌ కూడా ఆఫర్లపై లభ్యమవుతున్నాయి.

రివార్డులు ఆఫర్లు

ఇక ప్రతిరోజు అమ్మకపుదారులు పనిచేసేవారికి/ స్టడీ/ ఇంటి నుంచి పనిచేసేవారికి కావాల్సిన ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్, ఫర్నీచర్, హెడ్‌ఫోన్స్‌లాంటివి కూడా కస్టమర్ల కోసం అందిస్తున్నారు. ఇక ఎయిర్ ప్యూరిఫైయర్స్, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, డిష్ వాషర్లు, ఇంకా ఇంటి కోసం కావాల్సిన మరికొన్ని వస్తువులను కూడా అందిస్తోంది. బట్టలు, ఫ్యాషన్ యాక్ససెరీస్‌, బ్యూటీ ఉత్పత్తులు లాంటివి కూడా కస్టమర్లు షాప్ చేసుకోవచ్చు. ఈ సారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తమ అమ్మకపుదారులకు, భాగస్వాములకు మంచి అవకాశం ఇచ్చిందని అన్నారు అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ తివారీ. దేశవ్యాప్తంగా కొన్ని మిలియన్ మంది వినియోగదారులతో టచ్‌లోకి వచ్చేందుకు ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అవకాశం ఇచ్చిందన్నారు. నష్టాల్లో కూరుకుపోయిన తమ అమ్మకపుదారులు తిరిగి పుంజుకునే అవకాశం ఈ ఫెస్టివ్ ఆఫర్ ఇచ్చిందని మనీష్ తివారీ చెప్పారు. తమ కస్టమర్లకు కావాల్సిన అన్ని ఉత్పత్తులు అమెజాన్ వేదికపై దొరికేలా చూసి వారికి అవి సురక్షితంగా డెలివరీ చేయడమే తమ లక్ష్యమని మనీష్ తివారీ చెప్పారు.

ఈమధ్యనే నీల్సన్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం అమెజాన్‌తో జతకట్టిన 85శాతం మందికి పైగా చిన్న మధ్య తరహా వ్యాపారస్తులు తమ ఉత్పత్తుల అమ్మకాల్లో పెరుగుదల చూస్తారని పేర్కొంది. నష్టాల నుంచి తిరిగి గాడిలో పడతామని 74శాతం మంది అమ్మకపుదారులు భావిస్తున్నారని చెప్పిన సర్వే... 78 శాతం మంది తమ ఉత్పత్తుల్లో పెరుగుదల కనిపిస్తుందని భావిస్తున్నారని స్పష్టం చేసింది. ఇక సురక్షితమైన డెలివరీ చేసేందుకు అమెజాన్ తన డెలివరీ వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చింది. 200 డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని వేల మంది డెలివరీ పార్ట్‌నర్లను తమ నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చింది.

ఇక దేశంలో ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా తమ ఉత్పత్తులను డెలివరీ చేసేలా 15 రాష్ట్రాల్లో 60 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అమెజాన్ ఇండియా 5 కొత్త సార్ట్ సెంటర్లను ప్రకటించింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న 8 సార్ట్ సెంటర్లను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

English summary
E-commerce site Amazon had announced its Great Indian Festival sale 2020, where it had given a great discounts for electronics, home and Kitchen appliances.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X