వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్‌ను నిషేధించండి: టాయ్‌లెట్ కవర్లపై హిందూ దేవతల ఫోటోలు..నెటిజెన్ల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి వివాదాల్లో కూరుకుపోయింది. హిందూ దేవుళ్ల ఫోటోలు ఉన్న టాయ్‌లెట్ కవర్లను తమ వెబ్‌సైట్‌పై అమ్మకానికి పెట్టారు. ఇది అమెరికాలోని అమెజాన్ వెబ్‌సైట్‌పై కనిపించింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెజాన్‌ను నిషేధించాలంటూ ట్వీట్ చేశారు. చాలామంది ఈ-కామర్స్ వెబ్ సైట్‌ అమెజాన్‌ను నిషేధించాలని చెబుతూ అదే సమయంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను అమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అమెజాన్ సంస్థ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

2017లో కూడా భారత జెండా కలిగిన డోర్ మ్యాట్లను కెనడాకు చెందిన అమెజాన్ వెబ్‌సైట్ అమ్మకానికి ఉంచడంతో సుష్మా స్వరాజ్ సీరియస్ అయ్యారు. దీంతో భారత్‌లో పనిచేస్తున్న అమెజాన్ ఉద్యోగుల వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన అమెజాన్ సంస్థ క్షమాపణ చెప్పింది.

Amazon sells toilet covers with Hindu gods Photos on its portal

ఇంకా ఇది మరువక ముందే మళ్లీ హిందువుల దేవతల ఫోటోలతో అమెజాన్ సంస్థలో టాయ్‌లెట్ కవర్లు, యోగా మ్యాట్లు, స్నీకర్స్, రగ్స్, ఇతర వస్తువులు దర్శనమిచ్చాయి. అయితే విషయం తెలిసిన వెంటనే ఆ వస్తువులను అమ్మకాల జాబితా నుంచి తొలగించింది. 2017లో కూడా అమెజాన్ సంస్థ ఇలానే చేసింది. హిందువు దేవుళ్ల ఫోటోలతో కూడిన వస్తువులను అమ్మకానికి పెట్టగానే పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వెంటనే జాబితా నుంచి ఆ వస్తువులను తొలగించింది.

English summary
Amazon.com faced a social media backlash in India on Thursday after toilet seat covers and other items with images of Hindu gods were spotted on the US retailer's website, making #BoycottAmazon the country's top trending topic on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X