‘అంబానీ బాంబు’ కేసులో అనూహ్య మలుపు -పీపీఈ కిట్‌ను ఇలా కూడా వాడొచ్చా? -సీసీటీవీలో అనుమానితుడి గుర్తింపు
అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడైన ముఖేశ్ అంబానీ ఇంటికి బాంబు హెచ్చరిక కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఫిబ్రవరి 25న ముంబైలోని అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలు నింపిన కారును పార్క్ చేసినట్లుగా భావిస్తోన్న అనుమానితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి.
ఒక్కరోజు ముఖ్యమంత్రికి బీజేపీ గాలం -నటుడు అర్జున్‌తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ -అంత లేదంటూ..

పీపీఈ కిట్ ధరించి దర్జాగా..
సౌత్ ముంబైలోని ముకేశ్ అంబానీ ఇల్లు ‘‘ఆంటిలియా'' వద్ద నిలిపి పేలుడు పదార్థాలు కలిగిన స్కార్పియో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో అంబానీ కుటుంబానికి నిందితులు రాసిన బెదిరింపు లేఖను కూడా గుర్తించారు. కాగా, ఆ కారును పార్క్ చేసినట్లుగా భావిస్తోన్న సమయాన్ని అంచనా వేసి, అందుబాటులో ఉన్న సీసీటీవీ కమెరాల రికార్డులు అన్నింటినీ పరిశీలించారు. ఈ ఘటనలో అనుమానితుడిని సైతం సీసీటీవీ కెమెరాలోలో గుర్తించారు. సదరు అనుమానితుడు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్ ధరించినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది..

గుర్తు పట్టకుండా ఉండేదుకే..
అంబానీ ఇంటి ముందు జెలెటిన్ స్టిక్స్ నింపిన స్కార్పియో వాహనాన్ని పార్క్ చేసిన నిందితుడు.. దర్జాగా నడుచుకుంటూ వెళ్లి కాస్త దూరంలో నిలిపిన మరో వాహనం(ఇన్నోవా)లో పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీల్లో తేటతెల్లమైంది. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు అనుమానితుడు పీపీఈ కిట్ ధరించినట్లు పోలీసులు చెప్పారు. అనుమానితుడు పరారైన ఇన్నోవా కారు వివరాలను సేకరించేంచేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాగా,

కారు చోరీ.. ఓనర్ హత్య..
ముఖేశ్ అంబానీ ఇంటి ముందు గుర్తించిన స్కార్పియో కారును మన్సుక్ హిరేన్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ వాహనం.. ఫిబ్రవరి 18న ఐరోలీ ప్రాంతంలో దొంగతనానికి గురికాగా, మన్సుక్ హిరేన్ సైతం గత వారం అనుమానాస్పద స్థితిలో మరణించడం ఈ మిస్టరీని మరింత పెంచింది. బాంబు బెదిరింపు, హిరేన్ మృతి ఘటనలపై వేర్వేరుగా ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి.. కేసును ఎన్ఐఏకి అప్పగించింది..

దర్యాప్తుపై అనుమానాలు..
అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల కారును నిలిపినట్లుగా భావిస్తోన్న అనుమానితుడు పీపీఈ కిట్ ధరించి ఉండటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు వాడే పీపీఈ కిట్లను ఇలాంటి తీవ్ర నేరాలకు కూడా వాడటం విస్మయం కలిగిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. బాంబు బెదిరింపు కేసుతోపాటు స్కార్పియో యజమాని హిరేన్ అనుమానాస్పద మృతి కేసుల దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం లాగేసుకుని ఎన్ఐఏకు అప్పగించడంపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ఏదో మతలబు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
'అంబానీ బాంబు' కేసుపై మరో బాంబు -ఏదో కుట్ర దాగుందన్న మహా సీఎం -ఎన్ఐఏ దర్యాప్తుపై అనుమానం